Breaking News

28/10/2019

ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి

కర్నూలు అక్టోబర్ 28,  (way2newstv.in)
స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. చిన్న చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించవద్దు. వంద శాతం అర్జీలను గడువు లోపు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించి, ప్రభుత్వ యంత్రాంగం పై ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేయాలని సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. పత్తికొండ నియోజకవర్గ స్థాయి ప్రత్యేక స్పందనలో అయన పాల్గోన్నారు. 
ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి

పత్తికొండ టిటిడి కల్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డా.సంజీవకుమార్, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విధేకరే, జేసీ 2 సయ్యద్ ఖాజా మెహిద్దీన్, ఆర్డీఓ బాల గణేశయ్య. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆదోని డివిజన్, పత్తికొండ నియోజకవర్గ మండలాల అధికారులు హజరయ్యారు. స్పందనలో అర్జీలు ఇవ్వడానికి పత్తికొండ, తుగ్గలి, మద్ధికెర, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

No comments:

Post a Comment