Breaking News

22/10/2019

అమిత్ షా రాకతో ఏపీలో మార్పులు...

న్యూఢిల్లీ, అక్టోబరు 22, (way2newstv.in)
తెలుగు రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలని బీజేపీ కోరుకుంటున్న సంగతి విదితమే. దానికి వారు ముహూర్తం కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. నాలుగైదు నెలలుగా కేంద్రంలో కొత్త పరిపాలన, కాశ్మీర్ అంశం, వివిధ రాష్ట్రాల ఎన్నికలు …ఇలా చాలా పరిణామాలతో బిజేపీ పెద్దలు బిజీ అయిపోయారు. ఈ కారణంగా ఏపీ మీద దృష్టిపెట్టలేకపోయారట. ఈ నెలతో రాష్ట్రాలలో ఎన్నికల తతంగం పూర్తి కావస్తోంది. దాంతో బీజేపీ పెద్దలకు బోలెడు తీరిక దొరుకుతుంది. దాంతో ఎప్పటినుంచో వాయిదా పడిన ఏపీ టూర్ కి కూడా బీజేపీ జాతీయ సారధి అమిత్ షా రెడీ అవుతున్నారని తెలుస్తోంది. చాన్నాళ్ళుగా ఏపీకి రావాలనుకుంటున్నా కుదరక అమిత్ షా ఈ వైపు చూడలేదు. నవంబర్లో ఆయన ఏపీ టూర్ ఖరారు కావడం ఏపీ రాజకీయాల్లో వాడి వేడి చర్చకు ఆస్కారమిస్తోంది.ఏపీలో అమిత్ షా పర్యటనలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఎవరూ ఊహించని వారు కూడా తమ పార్టీలోకి వస్తారని అంటున్నారు. మరి అమిత్ షా వంటి జాతీయ అధ్యక్షుడు వస్తే అలా ఇలా ఉండకూడని బీజేపీ ఇప్పటినుంచే గాలం వేస్తోంది.
అమిత్ షా రాకతో ఏపీలో మార్పులు...

తమ పార్టీలో చేరేందుకు టీడీపీ, జనసేనలే కాదు, వైసీపీ నాయకులు కూడా ముందుకు వస్తున్నారని ప్రచారం చేసుకుంటోంది. మరి ఎవరు వారు, ఏమా కధ అన్నది ఏపీ రాజకీయ వెండితెరపైన చూడాల్సిందే. ఏపీలోని టీడీపీ నేతలు ఇప్పటికే పలువురు బీజేపీని సంప్రదించారని, వారు చేరేందుకు ఆసక్తిని కనబరచడంతోనే చంద్రబాబు హడలిపోయి కొత్త మాటలు, పొత్తులు ముందుకు తెస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండదని, ఏపీలో పార్టీ బ‌లోపేతమే లక్ష్య‌మని ఆయన అంటున్నారు.ఇక ఏపీలో అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో బీజేపీకీ ఏపీలో మిత్రులెవరు, శత్రువులేవరు అన్న దాని మీద కొంత క్లారిటీ వస్తుందని అంతా భావిస్తున్నారు. అమిత్ షా గతంలో గుంటూరు జిల్లా నరసారావుపేటలో మాట్లాడుతూ టీడీపీతో పొత్తులు ఇక ఉండవు, తలుపులు మూసేశామని స్పష్టంగా ప్రకటించారు. అపుడు సీన్ వేరు, ఇపుడు పరిస్థితులు వేరు. బాబు బేలగా మారారు. బీజేపీ కి సంకేతాలు పంపుతున్నారు. తప్పులు మన్నించమంటున్నారు. మరో వైపు వైసీపీ మీద బీజేపీ పెద్దల అభిప్రాయం ఏంటో తెలియడంలేదు, ఇవన్నీ కూడా చూచాయగానైనా అమిత్ షా టూర్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని కమలనాధులు భావిస్తున్న్నారు. దాన్ని బట్టి తాము ముందుకు ఎలా పోవాలో నిర్ణయించుకుంటామని కూడా చెబుతున్నారు. మరి అమిత్ షా కనుక తేల్చేస్తే ఏపీ వ్యవహారాలు కొత్త మలుపు తీసుకోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

No comments:

Post a Comment