విజయవాడ, అక్టోబరు 19 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కంపెనీల చట్టం 2013 సెక్షన్-8 ప్రకారం అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో సర్కార్ తెలియజేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా కన్సల్టెన్సీ, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.గత వారమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ఏపీలో పురుడు పోసుకున్న ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్
ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం.. సాధారణ పరిపాలనశాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. దీనికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌లో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవుట్ సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థ కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెబుతున్నారు. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాస్థాయిలో విభాగాలు.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నేతృత్వం, ఎక్స్ అఫిషియోగా కలెక్టర్ ఉంటారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వశాఖల్లో ఒకే పనికి ఒకే రకమైన వేతనం.. అది కూడా ఆన్‌లైన్ పద్థతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
No comments:
Post a Comment