Breaking News

04/10/2019

అందరి చూపు..హూజూర్ వైపు

నల్గొండ, అక్టోబరు 4, (way2newstv.in)
హుజూర్‌నగర్‌ ఎన్నికల బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ స్థానం నుంచి మొత్తం 76 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం (అక్టోబర్ 3) సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. 45 నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో 28 మంది బరిలో నిలిచారు.స్వతంత్ర అభ్యర్థులు ప్రతాప్‌ రెడ్డి, సైదులు, శంకర్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్‌ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. 

అందరి చూపు..హూజూర్ వైపు

దీంతో ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది.హుజూర్‌నగర్ ఉప ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి కిరణ్మయి ఉన్నారు. పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే నెలకొంది.సీపీఐ పార్టీ అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతిస్తుండటం ఈ ఎన్నికల్లో ఆసక్తికర అంశం. 2018 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సీపీఐ.. మహాకూటమితో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ ‘కారు’ పార్టీతో చేతులు కలిపింది. ఇక టీడీపీ పార్టీ సీపీఎం మద్దతును కోరుతుండగా.. టీజేఎస్ ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. మొత్తం మీద గత ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడిన పార్టీలన్నీ ఈసారి విడివిడిగా పోటీ చేస్తుండటం గమనార్హం. హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికలు అక్టోబర్ 21న జరగనున్నాయి.

No comments:

Post a Comment