శ్రీకాకుళం అక్టోబర్ 21 (way2newstv.in)
నా రాజకీయ చరిత్రలో 10 మంది ముఖ్యమంత్రి లను చూసాను. నేనె తెలుగుదేశం పార్టీ అని అనుకుంటే మీ పార్టీ రాష్ట్రం లో ఉండేదా. ఎన్ని కేసులు పెడతారు. కోడెల శివప్రసాద్ ను భయపెట్టారు. పల్నాటి పులి పై ఐ పి సి 405 కేసులు పెట్టారు. నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద ఎన్ని పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకపడ్డారు. జగన్
జగన్ ది చిల్లర రాజకీయం
హైదరాబాద్ పెళ్లికి పోతే ఖర్చు కాదు. కోర్టుకి పోతే ఖర్చు అందుకే కోర్ట్ కి వెళ్లలేవు. ఇది నీ చిల్లర రాజకీయమని ఆరో్పించారు. ఇప్పుడు ఫ్యాన్ న్ రివర్స్ లో తిరుగుతోంది. దీపావళి వస్తోంది. ,రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోడు. బంగారం దొరుకుతుంది కానీ ఇసుక దొరకదు. ఊరి కి ఒక ఇసుకాసురుడు తయారయ్యాడని అయన అన్నారు. బొగ్గు జగన్ ఫ్రెండ్ కేసీ ఆర్ నుంచి 3710 రూపాయల కు కొంటున్నాడు. నా హయంలో జీతాలు నెలాఖరుకు చెల్లించా. కరెంటు కోతలు లేకుండా చూసా. ఇసుక ఉచితం గా అందించా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ముందుముందు ఇంకా బాధలు తప్పవని చంద్రబాబు అన్నారు.
No comments:
Post a Comment