నెల్లూరు, అక్టోబర్ 28 (way2newstv.in):
జిల్లా వ్యాప్తంగా 12 వ్యవసాయ శాఖ సబ్‌డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 46 మండలాల్లో ఎరువుల దుకాణాలు ఉన్నాయి.. వీటి ద్వారా విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తుంటారు. ఈ దుకాణాల్లో నాణ్యమైన వాటిని విక్రయిస్తున్నారా.. ఎమ్మార్పీ ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయా.. రైతులు కొనుగోలు చేసిన వాటికి బిల్లులు ఇస్తున్నారా.. వాటిపై రైతుల సంతకాలు ఉన్నాయా.. ఇలాంటి వాటిపై మండల వ్యవసాయాధికారులు, సహాయ సంచాలకులు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా అధికారులు, ప్రత్యేక తనిఖీ అధికారుల నిఘా ఉంచాలి.
ఎవరిష్టం వారిదే.. (నెల్లూరు)
ఎరువుల దుకాణాలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దాంతోపాటు దుకాణదారులు, డీలర్లతో వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మకై విత్తనాలు, ఎరువులు తదితర వాటిని అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఇందుకు దుకాణదారులు కొంత ముట్టజెప్పుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో దస్త్రాల్లో అంతా బాగు అంటూ అధికారులే స్వయంగా రాసేసి, సంతకాలు చేసేస్తుంటారు.పైసలిస్తే.. లైసెన్సు మంజూరు, రెన్యువల్.. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో విత్తనాలు, పురుగు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించి లైసెన్సు మంజూరు చేయాలి. దాంతోపాటు రెన్యువల్ కూడ వారే చేయాల్సి ఉంది. వీటికి కొంత ధరను నిర్ణయించి, అక్కడి సిబ్బంది వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సస్యరక్షణకు సంబంధించి పరిశీలించే వారు గత కొన్నేళ్లుగా ఇలాంటి వ్యవహారాన్ని నడుపుతున్నారు. అలాగే ఎరువుల దుకాణం ఏర్పాటుకు సహాయ సంచాలకులు లైసెన్సు మంజూరు చేస్తుంటారు.
వ్యవసాయాధికారులు చేయాల్సింది..ఎరువుల దుకాణం ముందు సంబంధిత లైసెన్సు ప్రదర్శించారా.. లేదా అనే వాటిని వ్యవసాయాధికారులు గుర్తించాలి. దుకాణంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తదితర వాటి నిల్వలను తనిఖీ చేసి, నిర్ధరణ చేయాల్సి ఉంది. దుకాణదారులు విక్రయించిన ప్రతి బిల్లుపై విధిగా రైతు సంతకం ఉందో.. లేదో పరిశీలించాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాలు, పురుగు మందుల ధరలను ఉత్పత్తిదారులు నిర్దేశించిన ఇన్‌వాయిస్ మేరకు ఎంతైనా పెంచుకోవచ్ఛు. తగిం్గచుకోవచ్ఛు అయితే వారు నిర్దేశించిన ధరలకే దుకాణదారులు విక్రయించాలి. అలాగే ఎమ్మార్పీ ధరలు మించకూడదు. ఈ పద్ధతి జిల్లాలో పలుచోట్ల జరగడం లేదు. పలుచోట్ల రవాణా ఖర్చుల పేరిట రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. దాంతోపాటు పాత స్టాకును దాచి కొత్త స్టాకు వచ్చిన తర్వాత ప్రస్తుత ధరపై విక్రయాలు జరుగుతున్నాయి.ఎక్కడైనా పురుగుల మందు దుకాణం లైసెన్సు రెన్యువల్ చేసుకోవాలంటే జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో రూ.1500 వరకు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని పలుచోట్ల వివిధ రకాలుగా పలువురు వ్యవసాయాధికారులు మామూళ్లను వసూలు చేస్తుంటారు. కొందరు దసరాకు, మరికొందరు జనవరి నెలల్లో వసూలు చేస్తారని సమాచారం. దుకాణదారుడు నెలకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వ్యాపారం చేస్తే అధికారులకు రూ. వేలల్లో మామూళ్లు ముట్టజెప్పాల్సి వస్తోందని తెలుస్తోంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించే హోల్‌సేల్ డీలర్లు అయితే వ్యవసాయాధికారికే రూ.50 వేల వరకు మామూళ్లు సమర్పిస్తుంటారని తెలిసింది. పట్టణాల్లో దుకాణదారుల వద్ద నుంచి వారి వ్యాపారాన్నిబట్టి మామూళ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే నెల్లూరు నగరంలో కొన్ని హోల్‌సేల్ దుకాణాల వ్యాపారులు తమ వ్యాపారాన్ని అనుసరించి రూ.లక్షల్లో ముట్టజెపుతుంటారన్న అభియోగం లేకపోలేదు.
No comments:
Post a Comment