Breaking News

21/10/2019

కేసీఆర్ కు జైలు తప్పదు

మహబూబ్ నగర్ అక్టోబర్ 21 (way2newstv.in)
తెలంగాణలో ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది. మంత్రులు కేసీఆర్ చేతిలో కీలు బొమ్మలు గా మారారు. సెల్ఫ్ డిస్మిస్ అనేది కేసీఆర్ కు వర్తిస్తుంది కార్మికులకు కాదు. ఆర్టీసీ ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే ఆరుణ అన్నారు.  టెంపరరీ డ్రైవర్స్, కండెక్టర్స్ కార్మికుల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. భేషజాలు పోకుండా కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి. కేసీఆర్ అవినీతి బయటకు వస్తది.కేసీఆర్ కు జైల్ జీవితం తప్పదు. 
కేసీఆర్ కు జైలు తప్పదు

కార్మికులకు న్యాయం చేయాలేని మంత్రి పదవి ఎందుకని ఆమె ప్రశ్నించారు. కార్మికులకు అండగా బీజేపీ ఉంటుంది. కేసీఆర్ ను పదవి నుంచి దింపితే తెలంగాణ సేఫ్ గా ఉంటుంది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. కార్మికులకుఆనాడు కేసీఆర్ ఇచ్చిన హామీలని నెరవేర్చాలని కోరుతున్నమని ఆమె అన్నారు. కార్మికుల ఉసురు కేసీఆర్ కు తలుగుతుంది. ఆంధ్ర నాయకులు నవ్వుకునే పరిస్థితి వచ్చింది. రైతులు ఆందోళన లకు సిద్ధమవుతున్నారు. కార్మికులు పండుగ చేసుకోకుండా పస్తులుంటే నీకు నిద్ర ఎలా పడుతుందని ప్రశ్నించారు. ఆర్టీసీ అంటే నీకు ఎందుకు అంత చులకన. తెలంగాణ ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కబ్జా చేస్తున్నారని ఆమె విమర్శించారు.

No comments:

Post a Comment