Breaking News

25/10/2019

పిక్సిడ్ డిపాజిట్లపై తగ్గనున్న వడ్డీలు

ముంబయి అక్టోబరు 25 (way2newstv.in)
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లను తగ్గిస్తూనే వస్తోంది. దీంతో బ్యాంకులు ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. ట్రెండ్ గమనిస్తూ ఉంటే.. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కూడా నవంబర్ 1 నుంచి వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశాలున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే ఛాన్స్ ఉంది.శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫైనాన్స్ ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.25శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ కంపెనీ డిపాజిట్లకు ఏఏఏ రేటింగ్ ఉంది. దీంతో మీ డబ్బుకు పెద్దగా రిస్క్ ఉండదు. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ 1979లో ప్రారంభమైంది.
పిక్సిడ్ డిపాజిట్లపై  తగ్గనున్న వడ్డీలు

క్రిసిల్ నుంచి కంపెనీకి ఎఫ్ఏఏఏ రేటింగ్ ఉంది.వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ కమర్షియల్ వెహిలక్స్, మల్టీ యుటిలిటీ వెహికల్స్, త్రివీలర్స్, ట్రాక్టర్స్, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వంటి వాటికి ఈ కంపెనీ రుణాలు అందిస్తూ ఉంటుంది. కార్యకలాపాల విస్తరణ, స్థిరమైన రేటింగ్, అధిక వడ్డీ రేటు కారణంగా కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.ఏడాది నుంచి ఐదేళ్ల కాలపరిమితితో కంపెనీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఐదేళ్ల ఎఫ్‌డీలపై 9.25 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు కంపెనీ అదనంగా మరో 0.25 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే ప్రస్తుత ఎఫ్‌డీలను మళ్లీ రెన్యూవల్ చేసుకుంటే వారికి కూడా 0.25 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.ఫిక్స్‌డ్ డిపాజిట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో కమ్యులేటివ్, నాన్ కమ్యూలేటివ్ అనేవి ఇవి. కమ్యులేటివ్‌లో వడ్డీ మొత్తం మీ డిపాజిట్ మొత్తానికి యాడ్ అవుతూ వస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ మొత్తం లభిస్తుంది. నాన్ కమ్యూలేటివ్‌లో వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తారు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ప్రాతిపదికన వడ్డీ తీసుకోవచ్చు.

No comments:

Post a Comment