న్యూఢిల్లీ అక్టోబర్ 21 (way2newstv.in)
జేడీయూ అధినేత కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే శివకుమార్ ను కలుసుకునేందుకే కుమారస్వామి తీహార్ జైలుకు వెళ్లినట్లు తెలిసింది. వీరి భేటి బీజేపీని షాక్ కు గురిచేసింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి వచ్చిన కుమారస్వామి తీహార్ జైలుకు వెళ్లి తన తోటి సహచర మంత్రిగా చేసిన డీకేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తీహార్ జైలుకు కుమారస్వామి..
కర్ణాటకలో అధికారం కోల్పోయిన కుమారస్వామి ప్రభుత్వంలో ఇదే డీకే శివకుమార్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. మేలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు డీకే కీలకంగా వ్యవహరించి కుమారస్వామికి మద్దతుగా లాబీయింగ్ చేశారు. బీజేపీని ముప్పుతిప్పలు పెట్టారు. ఈయన ఉంటే బీజేపీ ప్రభుత్వం మనుగడ కష్టమేనన్న అభిప్రాయం కన్నడనాట ఉంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకేను కుమారస్వామి కలవడం తో ఏదో జరగబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది.ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రెండు నెలలుగా సీబీఐ ఈడీ అధికారుల అదుపులో ఉన్నారు. సుమారు 600 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నారు.అయితే కాంగ్రెస్ లో ఎలాంటి సంక్షోభాన్ని అయిని తనదైన శైలిలో పరిష్కరించి రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన డీకే శివకుమార్ ను వ్యూహాత్మకంగా బీజేపీ కేసులు పెట్టి జైలు పాలు చేసిందన్న అనుమానాలు కాంగ్రెస్ జేడీఎస్ లో ఉన్నాయి. డీకేను జైల్లో వేసి కర్ణాటకలో కొలువైన బీజేపీ సర్కారును ఐదేళ్లు కాపాడుకోవాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది.ఇక ఈ రాజకీయ భేటిపై కుమారస్వామి మాట్లాడారు. డీకే పై నమోదైన కేసులు ఏవీ నిరూపితం కాలేవని.. త్వరలోనే బెయిల్ పై ఆయన విడుదల అవుతాడని కుమారస్వామి చెప్పుకొచ్చాడు. రాజ్యాంగ బద్దమైన సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించాడు.
No comments:
Post a Comment