ఫ్రెండ్లి పోలీస్ ఇన్ తెలంగాణ అంశంపై "ఖాజా"కు ప్రధమ బహుమతి
సైబరాబాద్ పరిదిలోని కేశంపేట పీఎస్ కు దక్కిన అవార్డు
హైదరాబాద్ అక్టోబరు 21, (way2newstv.in)
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన "ఫ్రెండ్లీ పోలీస్" ఇన్ తెలంగాణ అను అంశంపై నిర్వహించిన సెమినార్ లో షాద్ నగర్ సబ్ డివిజన్ లోని కేశంపేట్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యన్.యమ్.ఖాజా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే మొదటి స్థానంలో నిలిచాడు .
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ ఖాజాకు అవార్డు
ఈ సందర్భంగా సోమవారం గచ్చిబౌలిలోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశంసా పత్రాన్ని మెడల్ ను అందజేశారు. ఈ సందర్భంగా కేశంపేట షాద్ నగర్ డివిజన్ పోలీసులు హర్షం వ్యక్తం చేసి ఖాజా ను అభినందించారు. గతంలో కూడా పోలీసులు -ప్రజా సంబంధాలు అనే అంశంపై కూడా అత్యంత ప్రతిభ కనబరిచి అప్పటి సిపి సందీప్ శాండిలియా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. రెండు సార్లు ఈ అవార్డు కేశంపేట పిఎస్ కు దక్కడం కొసమెరుపు.
No comments:
Post a Comment