Breaking News

28/10/2019

విశాఖనుంచి కొత్త విమాన సర్వీషులు ప్రారంభం

విశాఖపట్నం అక్టోబరు 28, (way2newstv.in)
దీపావళి పండగ వేళ విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి మరో కొత్త సర్వీస్ను స్పైస్ జెట్ ప్రారంభించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య స్పైస్ జెట్ సర్వీసు ను విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ ప్రారంభించారు. 
విశాఖనుంచి కొత్త విమాన సర్వీషులు ప్రారంభం

స్పైస్జెట్ విమాన సంస్థ విశాఖ నుంచి గన్నవరానికి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు పాటు సర్వీసులు ప్రారంభించనుంది. విశాఖ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.50 గంటలకు బయలుదేరి 10.50కు వైజాగ్ చేరుకుంటుంది. నేటి నుంచి చెన్నై, సింగపూర్లకు కూడా నూతన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి

No comments:

Post a Comment