Breaking News

28/10/2019

ఆందోళనలకు సమాయాత్తమవుతున్న సర్పంచ్ లు

నిజామాబాద్, అక్టోబరు 28, (way2newstv.in)
గ్రామపంచాయితీలకు నిధుల లేమి, జాయింట్ చెక్ పవర్ రద్దు తదితర సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ల సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేయనుంది. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ పథకం నిధుల్ని కూడా రాష్ట్ర సర్కార్ పెండింగ్లో ఉంచడాన్ని నిరసిస్తూ, రాజ్యాంగం ద్వారా పంచాయితీలకు దక్కే 29 అధికారాల్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తూ, వాటిని సాధించడం కోసం  సర్పంచ్ల సంఘం కార్యాచరణకు రెడీ అవుతోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను, పార్లమెంట్ శీతాకాల సమావేశాల టైమ్లో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించాలని భావిస్తోంది.సర్పంచ్ల సమస్యలు, డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో గవర్నర్ తలుపుతట్టాలని సంఘం నేతలు భావిస్తున్నారు. 
ఆందోళనలకు సమాయాత్తమవుతున్న సర్పంచ్ లు

ఈ నెలాఖరులోగా గవర్నర్ తమిళిసైని కలిసి  సమస్యల పరిష్కారానికి చొరచూపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని సంఘం నేతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, క్యాబ్ డ్రైవర్లు, ప్రజాసంఘాలు.. ఇలా అన్ని వర్గాలకు చెందినవాళ్లు ఇటీవల గవర్నర్ను కలిసి వినతి పత్రాలు ఇస్తుండటం, ఆమె జోక్యంతో క్యాబ్ డ్రైవర్లు సమ్మె విరమించుకోవడం తెలిసిందే. గవర్నర్ను కలిస్తేనన్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వస్తుందేమోనని సంఘం నేతలు భావిస్తున్నారు. సర్పంచ్లు చేస్తోన్న పోరాటానికి ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.రాష్ట్ర సర్కారు ఎన్ని బెదిరిం పులకు దిగినా వేలాది మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెపై వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. వాళ్లను ఆదర్శంగా తీసుకుని పోరాటాన్ని ఉదృతం చేయాలని సర్పంచ్ ల సంఘం నిర్ణయించుకుం ది. మా సమస్యలపై అతిత్వరలోనే గవర్నర్ ను కలుస్తాం. తద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుం ది. విషయం కేంద్రం దృష్టికి వెళుతుం ది. పంచాయితీలకు అధికారాల కోసం జమ్మూకాశ్మీర్ సర్పంచ్ లు చేపట్టినట్లే ఢిల్లీలోని పార్లమెంట్ ముందు పరేడ్ నిర్వహిస్తాం. రాష్ట్ర సర్కారు తీరుకు నిరసనగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తామంటున్నారు  సర్పంచ్ సంఘం నేతలు.

No comments:

Post a Comment