Breaking News

12/10/2019

ఎవ్వరికి కాన్ఫిడెన్స్ లేదే...

బెంగళూర్, అక్టోబరు 12, (way2newstv.in)
అక్కడ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టెన్షన్ తప్పేట్లు లేదు. గత ఐదేళ్లుగా అదే జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఐటీ దాడులు, సీబీఐ సోదాలు సర్వ సాధారణమయిపోయాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఇటువంటి దాడులు అధికమయ్యాయి. అయితే వీటిని రాజకీయ దాడులుగా చూస్తున్నప్పటికీ కొంత నిజం లేకపోలేదని వాదించే వారు కూడా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఐటీ దాడులు, సీబీఐ సోదాలు జరుగుతూనే ఉంటాయి.ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ఎన్నికలంటేనే వణుకు పుడుతుంది. ఎన్నికల సమయంలోనే తమ పై దాడులు జరుగుతుండటంతో వాటిని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. 
ఎవ్వరికి కాన్ఫిడెన్స్ లేదే...

ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మనీ ల్యాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు సురేష్, కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబాళ్కర్ కూడా ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.ఇక ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర ఇంటి పై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో త్వరలో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు జాలప్ప కుమారుడు రాజేంద్ర ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. ఆదాయపు పన్ను శాఖ మాత్రం రాజకీయ ఆరోపణలను కొట్టిపారేస్తుంది.పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న పక్కా సమాచారంతోనే దాడులు చేస్తున్నామని ఐటీ శాఖ చెబుతోంది. ముఖ్యంగా జాలప్ప కుమారుడు రాజేంద్ర, పరమేశ్వర కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో నీట్ పరీక్ష ద్వారా సీట్లు పొందేందుకు భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులను జేడీఎస్ కూడా ఖండిస్తోంది. ప్రతీకార చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని దళపతి దేవెగౌడ విమర్శలు గుప్పించారు. మొత్తం మీద కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు విపక్ష నేతలు వణికిపోతున్నారు.

No comments:

Post a Comment