Breaking News

02/10/2019

గ్రామ ప్రణాళిక పనులు ఈనెల 5వ తేదీలోగా పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.శరత్
జగిత్యాల  అక్టోబర్, 02 (way2newstv.in)
జిల్లాలో 30 రోజుల  గ్రామ ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం  అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ సమీక్షించారు. జిల్లాలోని మండలాల వారీగా జరుగుతున్న పనులపై కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా వారి పరిధిలోని గ్రామాలలో ఏ విధముగా పనులు నిర్వహించబడుచున్నది, రోడ్ సైడ్ ప్లాంటేషన్, పిచ్చి మొక్కలు, నిరుపయోగంగా పనికిరాని పాత ఇల్లు, బోర్ల, బావులు, మురికి కాలువలు, నీరు నిలుచు గుంతలు, డంపింగ్ యార్డు, వైకుంఠ దామం, విద్యుత్తుకు సంబంధించిన వంగిన పోల్స్, తుప్పుపట్టిన పోల్స్, విరిగిన పోల్స్  ,లూసు వైర్లు, థర్డ్ వైరు, మండలం పరిధిలోని గ్రామాల వారీగా ఎన్ని గుర్తించారు. 
గ్రామ ప్రణాళిక పనులు ఈనెల 5వ తేదీలోగా పూర్తిచేయాలి

ఎన్ని పూర్తి చేశారు. ఎన్ని మిగిలి ఉన్నవి వాటిని ఈనెల 5వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పూర్తి చేసిన పనులను సంబంధిత గ్రామ పరిధిలోని కార్యదర్శితో ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని ఈ రిపోర్టు అప్లోడ్ చేసే బాధ్యత మండల ఎంపీడీవో, ప్రత్యేక అధికారి, డి ఎల్ పిఓ,కార్యదర్శి, సర్పంచుల దని అన్నారు. ప్రతి గ్రామంలో 85% మొక్కలు రక్షించే బాధ్యత కార్యదర్శులతో పాటు సర్పంచ్ ఎంపీడీవో కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో తయారుచేసిన ఒక్క సంవత్సరం ప్లాన్ సంబంధిత నిధులుగ్రామాలలో గ్రామ సభలలో ప్రవేశపెట్టి అందులో సిబ్బంది వేతనాలు, విద్యుత్తు 10 శాతము గ్రీన్ బడ్జెట్ ఫోను మిగిలిన డబ్బులను ఏ విధంగా ఏ పనులకు ఖర్చు పెట్టాలని గ్రామ సభలలో తీర్మానించు కోవాలని బడ్జెట్ విషయంలో సంఘాలకు గ్రామ ప్రజలకు తెలిపే విధంగా గ్రామ సభలో చర్చించి చెప్పాలని అన్నారు. గ్రామ నిధుల గురించి ఎవరైనను అడిగినను మహిళా సంఘాల వారు చెప్పే విధముగా చైతన్య పరిచి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 5 వ తేదీ వరకు ఉన్నందున అందరూ విధిగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సిబ్బందిని బట్టీ వార్డులను బట్టి సిబ్బందికి ఎన్ని వార్డులు వస్తే అన్నింటినీ కేటాయించాలని గ్రామపంచాయతీ తీర్మానంలో చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలు అన్ని సంచులతో పాటు మండల కేంద్రమునకు పంపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి రాజేశం, పి సీఈవో శ్రీనివాస్, డి ఎఫ్ ఓ నర్సింగరావు ,డిఆర్డిఎ పిడి బిక్షపతి, ఆర్ డి ఓ నరేందర్, డి పి ఓ శేఖర్, డి వో లు, మండల ప్రత్యేక అధికారులు, మండల పంచాయితీ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment