Breaking News

02/10/2019

పర్యావరణ సంరక్షణ మనందరి బాధ్యత

జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి
పెద్దపల్లి , అక్టొబర్ 02(way2newstv.in)
పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత అని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం సుల్తానాబాద్ మండలంలోని నారాయణపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రమదానంకార్యక్రమంలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ  పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్యం అధిక ప్రాధాన్యత ఇచ్చే వారని, గాంధీ బాటలో మనందరం సైతం మన పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సాధించగలుగుతాము అని అన్నారు. జీవన విధానంలో ప్లాస్టిక్ ను అధికంగా వినియోగించుకోవడం వల్ల పర్యావరణానికి చాలా నష్టంవాటిల్లుతుందని, దీన్ని నివారించడానికి ప్రభుత్వం సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ ను నిషేధించిందని, జిల్లాలోని ప్రజలు వీటి స్థానంలో క్లాత్ బ్యాగ్ లను వినియోగించాలని జెసి కోరారు. 
పర్యావరణ సంరక్షణ మనందరి బాధ్యత

ప్లాస్టిక్బ్యాగులను వినియోగించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని జెసి తెలిపారు. గ్రామ అ స్వరాజ్య సాధన దిశగా ప్రభుత్వం పని చేస్తుందని, గాంధీ ఆశయాల మేరకు మనగ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం అందరూ శ్రమదానం లో పాల్గొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు జిల్లా జాయింట్ కలెక్టర్ క్లాత్ బ్యాగ్ లనుమరియు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.అనంతరం కమాన్పూర్ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జెసి గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.శాంతి అహింసా ఆయుధాలుగా దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన గాంధీ జయంతి సందర్భంగా జెసి శాంతికి, స్వేచ్ఛకు చిహ్నంగా పావురాన్ని మరియు బెలూన్లను వదిలివేశారు.అనంతరం జెసి  150 మంది చిన్నారులతో కలిసి మానవహారం నిర్వహించారు.  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గాంధీ గారు సూచించే వారని,మహాత్మాగాంధీ ఆశయాలకుఅనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించి వాడినివినియోగిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు ప్రజల సహకారం అధికారుల కృషి కారణంగా పెద్దపెల్లి జిల్లా కుగత సంవత్సరం జాతీయ గుర్తింపు లభించిందని, స్వచ్ఛ సుందర సౌచాలయ్ లో సైతంపెద్దపల్లి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి అవార్డును స్వీకరించిన అని జేసీ తెలిపారు.అధికారుల నిరంతర కృషి ప్రజల భాగస్వామ్యంతో పెద్దపెల్లి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే 2019 లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి నేడు గౌరవ ప్రధాన మంత్రిచేతుల మీదుగా మలబార్ లో మన జిల్లా కలెక్టర్ గారు అవార్డు మన ప్రతినిధిగా తీసుకుంటు న్నారని, ఇది మనందరికీ గర్వకారణం అని జేసీ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు గత 25 రోజులుగా గ్రామాలలో అభివృద్ధి పారిశుద్ధ్యం పచ్చదనాన్ని పెంపొందించడం పట్ల అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సైతం వివిధ స్థాయిలలోపాలుపంచుకొని గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ప్రతి ఒంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా సేకరించారని, ప్రతి గ్రామంలో స్మశానవాటికడంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి గ్రామంలో పిచ్చి మొక్కలను తుమ్మ చెట్లను పూర్తిస్థాయిలో తొలగించామని, విద్యుత్ సమస్యలుపరిష్కరించుకుంటున్నామని జేసీ తెలిపారు. గ్రామంలో రోడ్లపై చెత్త వేసిన, నిషేధించిన ప్లాస్టిక్ను వినియోగించిన వారిపై 500 రూపాయల జరిమానా తప్పనిసరిగా విధించాలని విధించాలని, ఈ నియమాన్ని కఠినంగా అమలు చేయాలని జేఏసీ అధికారులకు ఆదేశించారు.  కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామం లో నిర్మించే స్మశాన వాటికకు జాయింట్ కలెక్టర్బుధవారం భూమి పూజ నిర్వహించారు.అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ ప్రజలతో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ పూర్తిస్థాయిలో నిషేధించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,  సుల్తానాబాద్ ఎంపీడీవో సంతోష్, ఎంపీపీ బాలరాజు, కమాన్ పూర్ ఆర్ ఎం పీ డీ వో, తహసిల్దార్, ప్రత్యేక అధికారి సాయినాథ్సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment