Breaking News

02/10/2019

కర్నూలులో బాపుజీకి నివాళులు

కర్నూలు  అక్టోబరు 2 (way2newstv.in)
బుధవారం ఉదయం కర్నూలు నగరపాలక సంస్థ పరిదిలో లేబర్ కాలనీ 44 వ వార్డులో ఏర్పాటు చేసిన సభలో మహాత్మా గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఎంపీ డా. సంజీవకుమార్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జెసి రవి పట్టన్ శెట్టి ఇతరులు ఘనంగా నివాళులను అర్పించారు.  తరువాత  వార్డు సచివాలయ వ్యవస్ధ ను వార్డుసచివాలయ భవనాన్ని ప్రారంభించారు.
కర్నూలులో బాపుజీకి నివాళులు

గౌతమబుద్దుడి తర్వాత అంతటి అహింసావాది జాతిపిత మహాత్మా గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం చాలా సంతోషకరమని వారన్నారు. ముఖ్యమంత్రి,  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, సూచనలకు అనుగుణంగాకర్నూలు జిల్లాలో 881 గ్రామ, 300 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసాం. మెత్తం 9597 మంది సచివాలయ సిబ్బంది లో 5500 ల మంది సిబ్బందికి నియామక పత్రాలనుఅందించాం. కర్నూలు నగరంలో 132 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసామని వారాన్నారు.

No comments:

Post a Comment