ముంబై, ఆక్టోబరు 5, (way2newstv.in)
పసిడి ధర దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ శనివారం బంగారం ధర పడిపోయింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పతనమైంది. దీంతో ధర రూ.38,300కు దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీలమైన ట్రెండ్ ఉన్నా సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.50 తగ్గుదలతో రూ.37,100కు క్షీణించింది. పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.46,000కు చేరింది.హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.39,670కు చేరింది.
38 వేలు దాటేసిన బంగారం
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. రూ.36,360 వద్దనే నిలకడగా ఉంది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.46,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 1,510.25 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.46 శాతం క్షీణతతో 17.59 డాలర్లకు తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన డిమాండ్‌కు తోడు రూపాయి కరెన్సీ విలువ పతనమవడంతో బంగారం ధర మళ్లీ రూ.38 వేల మార్క్‌ను దాటింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం పసిడి ధర రూ.348 అధికమై రూ.39,115కి చేరుకున్నది. బంగారంతోపాటు వెండి మరింత పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ళ మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.1,630 అధికమై రూ.47,580 పలికింది. గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు అధికమవడం, డాలర్‌తో పోలిస్తే కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో ధరలు పెరుగడానికి ప్రధాన కారణమని బులియన్ వర్గాలు వెల్లడించారు.
No comments:
Post a Comment