Breaking News

05/10/2019

భారీగా పండిన పెసర

ఖమ్మం, అక్టోబరు 5, (way2newstv.in)
ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలో వేసిన పెసర పంట చేతికి రావటంతో వాటిని అమ్ముకునేందుకు రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీనికి తోడు ఖమ్మం మార్కెట్‌లో పెసల పంట కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్ ద్వారా మంచి ధర వస్తుందని ఆశించిన రైతులు పెసల పంటను అమ్ముకునేందుకు ఖమ్మం మార్కెట్‌కు పెసల పంటతో వస్తున్నారు. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పెసల జోరు ఊపందుకుంది. కాగా మార్కెట్‌లో పెసల పంటను మార్క్‌ఫైడ్ ద్వారా అమ్ముకునేందుకు రైతులు ఆశక్తి చూపుతున్నప్పటికి ఆ దిశగా ఇబ్బందులు సైతం ఎదుర్కొవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 
భారీగా పండిన పెసర

మార్క్‌ఫైడ్ ద్వారా పెసల పంటలను కొనుగోలు చేసేందుకు ధృవీకరణ పత్రాలు సమర్పిం చాలని ఖచ్చితమైన నిబంధనలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పెసల పంటకు ధర ఖమ్మం మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా 6,975రూపాయలు పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికి పెసల పంటను అమ్ముకునేందుకు పెట్టిన నిబంధనల వల్ల తమ పంట పరిస్థితి ఏమీటన్న సందేహాలు సైతం రైతుల్లో ఏర్పాడింది. ఖమ్మం మార్కెట్‌కు సుమారు వెయ్యి క్వింటాళ్ళ పెసల పంట వచ్చినప్పటికి వాటిలో  400క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేయటం గమనార్హం. ఇంక మిగిలిన 600క్వింటాళ్ళ పెసల పంటను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ నిరాకరించింది. దీంతో రైతులు చేసేదేమిలేక మార్కెట్‌లోనే పడిగాపులు కాయల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. తీసుకువచ్చిన పంటను తిరిగి తీసుకువెళ్ళలేక తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు తీవ్ర అవస్థలు పడుతుండటం గమనార్హం. పెసల పంటను మార్క్‌ఫైడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన నిబంధనలను సడలించి రైతులకు సహకరించాలని వారు కోరుతున్నారు.

No comments:

Post a Comment