Breaking News

30/09/2019

అజార్ విక్టరీ వెనుక...

హైద్రాబాద్, సెప్టెంబర్ 30, (way2newstv.in)
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అయితే ఈ ఎన్నికల్లో తెర వెనుక రాజకీయం నడిచిందా ? అంటే అవుననే వినిపిస్తోంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి బీజేపీ లో చేరిన వివేక్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఇందుకోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు . సాంకేతిక కారణాల వల్ల ఆయన నామినేషన్ తిరస్కరించారు . దీంతో ఏం చేయలేని పరిస్థితి వివేక్ ది. హెచ్ సి ఏ లో గట్టి పట్టున్న వివేక్ , ఇక ప్రకాష్ చంద్ ప్యానెల్ కు మద్దతు తెలిపారు .టి.ఆర్.ఎస్ పార్టీని వీడిన వివేక్ ను ఎలాగైనా హెచ్.సి.ఏ ఎన్నికల్లో రానీయకూడదని అధికార పార్టీ రాజకీయ చతురత వినియోగించినట్లు తెలుస్తోంది. 
అజార్ విక్టరీ వెనుక...

ఓ వైపు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ప్యానెల్ పోటీలో ఉండగా మరోవైపు వివేక్ బలపరిచిన ప్రకాష్ ప్యానెల్ పోటీపడింది. దీంతో ప్రకాష్ చంద్ర ప్యానెల్ ను ఓడించాలని అధికారపార్టీ తెర వెనుక రాజకీయం చేసినట్లు సమాచారం.ఎన్నికలకు ముందే అజారుద్దీన్ అధికార పార్టీకి చెందిన నేతలను కలిసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ను కలిసి హెచ్.సి.ఏ ఎన్నికల్లో గెలిపించేలా మద్దతు ఇవ్వాలని అజర్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ ఇందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు ను  కూడా కలిసి అజారుద్దీన్ మద్దతు కోరారు. ఇటు కాంగ్రెస్, అటు అధికార పార్టీ మద్దతును కూడగట్టుకుని ఎట్టకేలకు అజారుద్దీన్ ప్యానెల్ విజయం సాధించింది. అజారుద్దీన్ ఎన్నికలకంటే ముందే టిఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతోనే ప్రభుత్వ మద్దతును కూడగట్టినట్లు సమాచారం. ఎన్నికల్లో విజయం సాధించగానే అజర్ వెంటనే కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తున్నట్లు చెప్పడం కూడా దీనికి బలం చేకూర్చింది. అజారుద్దీన్ కేటీఆర్ ను కలిసి ఆశ్చర్యపరిచారు. మరి అజారుద్దీన్ కారెక్కుతారో లేదో వేచిచూడాల్సిందే.

No comments:

Post a Comment