Breaking News

30/09/2019

పోలీసులను టార్గెట్ చేసిన టీడీపీ

విజయవాడ, సెప్టెంబర్ 30, (way2newstv.in)
అదేంటో ఏపీ పోలీసుల మీద తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. నాలుగు నెలల ముందు ముద్దుగా కనిపించిన ఖాకీలు ఇపుడు తెగ చేదు అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు కూడా పోలీసుల మీద పెద్ద నోరు చేసుకుంటున్నారు. పోలీసులు మారిపోయారు, మునుపటిలా లేరు, అపుడెలా ఉండేవారని అంటూ రాగాలూ దీర్ఘాలు తీస్తున్నారు తమ్ముళ్ళు. ఏపీలో శాంతిభద్రతలు కరవు అయ్యాయి, పోలీసులు అధికార పార్టీకి దాసోహం అయ్యారు. ప్రతిపక్షం మీద దాడులు జరుగుతుంటే అసలు పట్టించుకోవడంలేదు, ఇలాగేనా వ్యవహరించేది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గుస్సా అవుతున్నారు. ఇంతకీ ఏపీ పోలీసులు చేసిన పాపం ఏంటి.ఏపీ పోలీసులను గూండాలతో, రౌడీలతో బాధ్యత కలిగిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోల్చడం విశేషం. పోలీసులు మీద ఆయన హాట్ కామెంట్స్ ఇపుడు చర్చగా సాగుతున్నాయి. 
పోలీసులను టార్గెట్ చేసిన టీడీపీ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్రాక్షనిజం చేస్తారని, అది ఆయన వంట్లోనే ఉందని విమర్శించిన అయ్యన్న దానికి పోలీసులను కూడా జత కలిపేశారు. జగన్ పోలీస్ వ్యవస్థను మొత్తం కలుషితం చేశారని, వారు సైతం గూండాలుగా మారారంటూ నోరు జారేశారు. చంద్రబాబు దారిలోనే అయ్యన్న పయనించారు. దీని మీద విశాఖ ఏసీపీ రంగారెడ్డి గట్టి కౌంటరే ఇచ్చారు. పోలీసుల మీద ఇలా మాట్లాడం మాజీ మంత్రికి తగునా అంటూ ప్రశ్నించారు. తాము చట్టబద్దంగా మాత్రమే పనిచేస్తాం తప్ప ఎవరికీ తలవంచేది లేదని ఆయన అన్నారు. తాము తప్పు చేస్తే చెప్పాలి తప్ప తమనే నిందించి సమాజంలో తమ స్థాయిని చులకన చేయవద్దని ఆయన కోరారు. అదే విధంగా మాజీ మంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్న అయ్యన్న తన హోదాను దిగజార్చుకోవద్దని కూడా ఆయన సూచిందడం విశేషం.ఈ మాట అన్నది అయిదేళ్ళ పాటు ఏపీని ఏలిన చంద్రబాబు. ఆయన హయాంలో పోలీస్ వవస్థ చాలా బాగుండేదట. చక్కగా శాంత్రిభద్రతలు ఉండేవట. కేవలం నాలుగు నెలల కాలంలోనే అంతా తల్లకిందులైందని వాపోతున్నారు. ఈ మేరకు చంద్రబాబు డీజీపీ సవాంగ్ కి లేఖ రాసారు. ఇది సరే కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగితే నాటి డీజీపీ ఎటువంటి దర్యాప్తు జరపకుండానే గంట వ్యవధిలోనే అది జగన్ స్వయంగా ఏర్పాటు చేసుకున్న డ్రామా అంటూ చెప్పడాన్ని ఎవరూ మరచిపోలేదుగా. తహశీల్దార్ వనజాక్షిని దెందులూరు అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు దాడి చేసిన ఘటనలు, కాల్ మనీ కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నాటి టీడీపీ జమానాలో జరిగాయి. ఇవన్నీ మరచిపోయి ఇపుడు పోలీసులు మారిపోయారని చంద్రబాబు చెప్పడం పట్ల ఆ శాఖ అధికారులే నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. పల్నాడులో శాంతిభద్రతలు లేవని చంద్రబాబు అంటే తాము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తునామని, అంతా బాగానే ఉందని గట్టి కౌంటర్ ఇచ్చిన అక్కడి పోలీసులకు తమ్ముళ్ళు ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు. ఓ విధంగా టీడీపీ పోలీసులతో పెట్టుకుని కొత్త తలనొప్పులు తెచ్హుకుంటోదని అంటున్నారు.

No comments:

Post a Comment