రాజమండ్రి, సెప్టెంబర్ 19, (way2newstv.in)
ష్ట్రంలో ఎదగాలని, పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీలో తాజాగా ఓ అంశం చర్చకు వస్తోంది. ఇన్నేళ్లుగా పార్టీని పట్టుకని వేలాడి, పార్టీ కోసం అనేక కేసులు, ప్రత్యర్థి పార్టీల నుంచి వ్యాఖ్యలు కూడా ఎదుర్కొని, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకున్న పాతనాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అదే సమయంలో వివిధ పార్టీ లు మారి.. పార్టీలోకి చేరిన వారికి ప్రాధాన్యం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు పాత కాపులు అల్లాడిపోతున్నా రు. తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని కుమిలి పోతున్నారు. ఈ క్రమంలో అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందనే విషయం ఆసక్తిగా మారింది.నలుగురు కీలక నాయకులు పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. పార్టీ కోసం ఎంతో చేశారు.
కమలంలో కలవరం...
అదే సమయంలో పార్టీ తరఫున లభించిన పదవులను కూడా అనుభవించినా.. పార్టీ లైన్‌ను ఎప్పుడూ తప్ప లేదు. పార్టీ పట్ల ఎంతో నిబద్ధతను చాటుకున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, ప్రస్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ(ప్రస్తుతం ఈయన జనసేనలో ఉన్నారు. అయితే, మళ్లీ బీజేపీలోకి చేరిపోవాలని ఆకాంక్షి స్తున్నారు) వంటి వారికి ప్రాధాన్యం లేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.వీరంతా బీజేపీలో మూలస్తంభాలుగా ఉండేవారు. ఆకుల సత్యనారాయణ మాత్రం ఎన్నికలకు ముందు జనసేనలోకి వెళ్లారు. కానీ, అప్పటి వరకు మాత్రం ఆయన బీజేపీకి విధేయుడిగానే ఉన్నారు. మిగిలిన వారు కూడా అంతే. అయితే, ఇటీవల కాలంలో బీజేపీలోకి చేరిన కొత్త రక్తం కారణంగా వీరికి ఎక్కడా ప్రాధాన్యం లభించడం లేదని అంటున్నారు పరిశీలకులు. కంభంపాటి హరిబాబు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా, విశాఖలో విజయమ్మను ఓడించిన ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా ఉన్న హరిబాబును బీజేపీలో పట్టించుకునే వారే లేరు.ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ఊహాగానాలు వచ్చినా అధిష్టానం మాత్రం వాయిస్ లేని హరిబాబుకు పదవులు ఎందుకు ? అన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సోము కూడా నిత్యం మీడియాలో ఉండే పరిస్థితి నుంచి ఇంటికే పరిమితమైన పరిస్థితి ఏర్పడింది. టీడీపీపై సోము ఎలా విరుచుకు పడేవారో ? చూశాం. ఇప్పుడు ఈ రేంజ్‌లో వైసీపీపై విమర్శలు చేయడం లేదు. అదేవిధంగా పైడికొండల కూడా విమర్శలు చేస్తున్నా.. పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు.ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఎన్నికలకు ముందు వచ్చి చేరిన నేతలతో పాటు ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి చేరిన నేతల హంగామానే ఎక్కువుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఎంతో కీలక పాత్ర పోషించిన పాత నేతల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.
No comments:
Post a Comment