హైద్రాబాద్, సెప్టెంబర్ 20, (way2newstv.in)
ఆర్టీసీకి రోజూ రూ.2.55 కోట్ల నష్టం వస్తోందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. డీజిల్ ధర పెరగడం వల్లే ఈ నష్టాలన్నారు. ఆర్టీసీలో 36 శాతం పల్లె వెలుగు, 37 శాతం జంటనగరాల బస్సులు తిరుగుతున్నాయని, ఈ రెండు చోట్ల నష్టాలెక్కువ ఉన్నాయని తెలిపారు. ఆదాయం పెంచే మార్గాలను వెతుకుతున్నామని చెప్పారు. ఆర్టీసీలో రోజుకు రూ.15.98 కోట్లుఖర్చు చేస్తుండగా రూ.13.37 కోట్ల రెవెన్యూనే వస్తోందని వెల్లడించారు. అయినా టికెట్ చార్జీలు పెంచలేదన్నారు. బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 69 నుంచి 73.12 శాతానికి పెరగడం వల్లరెవెన్యూ రూ.184 కోట్లు పెరిగిందని చెప్పారు. తాజా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.550 కోట్లు కేటాయించామన్నారు.
ఆర్టీసీకి నష్టాలు తెస్తున్న పల్లెవెలుగు బస్సులు
జంటనగరాల్లో ఎయిర్‌పోర్టు రూట్‌లో 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని,త్వరలో మరో 325 రానున్నాయని, వీటిని ఇతర మార్గాలకు నడుపుతామని తెలిపారు. వెహికల్ లైఫ్ ట్యాక్స్ వసూలులో ఏటా 15 నుంచి 18 శాతం వృద్ధి ఉండేదని, మాంద్యం వల్ల ఈ ఏడాది 2శాతం తగ్గిందని చెప్పారు. ఆర్టీఏ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం తగ్గించడానికి 59 సేవలను ఆన్‌లైన్ చేశామని, బండ్ల డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా ఎం వాలెట్ యాప్‌తీసుకొచ్చామని అన్నారు.నల్గొండ జిల్లా మల్కాపూర్‌లో వెహికల్ ఫిట్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అందుబాటులోకి వస్తుందని మంత్రి అజయ్ చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఎంవీయాక్ట్ 2019ను రాష్ట్రం లో అమలు చేయబోమని సీఎం అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. ఫైన్‌లు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. డ్రైవర్లకుపని భారం పెరిగిందని ఎమ్మెల్యేలు ప్రస్తావించగా ఖండించారు. డ్రైవర్ల కొరత మాత్రం ఉందని.. 1,500 మంది డ్రైవర్లు, 500 మంది కండక్టర్ల నియామకానికి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలుపంపామని, ఓకే అవగానే రిక్రూట్ చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాలను తాకట్టు పెట్టారని, రాష్ట్ర ఆవిర్భావం తరువాత పెట్టలేదని చెప్పారు. రాణిగంజ్ 1,2, ముషీరాబాద్స్థలాలు తాకట్టు పెట్టలేదన్నారు.
No comments:
Post a Comment