Breaking News

23/09/2019

ఒక్క బుల్లెట్టు పేల్చలేదు..ఒక్క ప్రాణం పోలేదు: అమిత్ షా

న్యూఢిల్లీ సెప్టెంబర్ 17, (way2newstv.in)
జమ్మూకశ్మీర్  ప్రశాంతంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, ఆగస్టు 5 నుంచి ఇంతవరకూ అక్కడ ఒక్క బుల్లెట్ పేల్చలేదని, ఒక్క ప్రాణం కూడా పోలేదని అన్నారు. 'కశ్మీర్ ప్రశాంతంగా ఉంది' అని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం 2016లో మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేసినప్పుడు యాధాలాపంగా జరిగినట్టుగానే చాలామంది భావించారని, అయితే ఇటీవల 370 అధికరణ రద్దు తర్వాత దేశ రక్షణ విధానాలపై వారందరికీ చాలా స్పష్టత వచ్చిందని అమిత్ షా అన్నారు.
ఒక్క బుల్లెట్టు పేల్చలేదు..ఒక్క ప్రాణం పోలేదు: అమిత్ షా

మెరుపుదాడులు, వాయిదాడులు ప్రజలకు సంతోషం కలిగించి ఉండవచ్చనీ, అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం చాలా దైర్యం కావాలని అన్నారు. ఆ నిర్ణయం తర్వాత భారత్పై ప్రపంచ దేశాల వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు.యూపీఏ హయాంలో ప్రతిరోజూ అవినీతి, సరిహద్దుల్లో అభద్రత, సైనికుల తలలు నరికివేత, మహిళలకు కొరవడిన రక్షణ, ప్రతిరోజూ రోడ్లపైకి జనం వచ్చి నిరసనలు తెలపడం వంటి వార్తలు చోటుచేసుకుంటూ ఉండేవని అమిత్ షా విమర్శించారు. ప్రధాని ఒకరు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనను ఖాతరు చేయకుండా తామే ప్రధానులుగా భావించుకుని పాలన సాగించారని కాంగ్రెస్ హయాంపై చురకలు వేశారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మోదీ సర్కార్ ఓటు బ్యాంకును ఆశించకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూవచ్చారని చెప్పారు. గత ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకునేందుకు 30 ఏళ్లు పడితే, తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, వాయుదాడులు సహా 50కి పైగా కీలక నిర్ణయాలు తీసుకుందని షా చెప్పారు.

No comments:

Post a Comment