Breaking News

07/09/2019

డెంగీ జ్వరాలతో భయం...భయం

హైద్రాబాద్, సెప్టెంబర్ 7, (way2newstv.in)
'జనం డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారు. 1400కుపైగా కేసులు నమోదు అయినట్టుగా పత్రికల్లో చదివాం. సమస్య తీవ్రంగా ఉన్నట్టు కనబడుతున్నది. సమస్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలి. జనం రోగాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందంటూ'' హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. పిటిషనర్‌ రిట్‌లో పేర్కొన్నట్టుగానే డెంగీ జ్వరాలతో జనం బాధపడుతున్నట్టుగా పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయని, రోజూ పత్రికల్లో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైద్యపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. 
డెంగీ జ్వరాలతో భయం...భయం

హైదరాబాద్‌ శివారులోని కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. డెంగీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వారంరోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. నియంత్రణతోపాటు డెంగీ బారిన జనం పడకుండా ఉండేందుకు ప్రజలకు ఏవిధమైన హైదరాబాద్‌ శివారులోని కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. డెంగీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వారంరోజుల్లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. నియంత్రణతోపాటు డెంగీ బారిన జనం పడకుండా ఉండేందుకు ప్రజలకు ఏవిధమైన అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారో కూడా తెలియజేయాలని సూచించింది. జనం అవస్థలు పడుతున్నా, ప్రభుత్వపరంగా చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని డాక్టర్‌ కరుణ తరఫు లాయర్‌ వాదించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో డెంగీ తీవ్రత  అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారో కూడా తెలియజేయాలని సూచించింది. జనం అవస్థలు పడుతున్నా, ప్రభుత్వపరంగా చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని డాక్టర్‌ కరుణ తరఫు లాయర్‌ వాదించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని, వేలాది మంది విద్యార్థులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని వివరించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఇతర ఆస్పత్రుల్లో రోగులు పడిగాపులు పడాల్సివస్తున్నదని, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తున్నదని ప్రభుత్వం తరఫున ఏజీ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు. ఇంతవరకూ ఎలాంటి నివారణా చర్యలు చేపట్టారు, ప్రజలకు అవగాహన తదితర విషయాలపై వివరాలిస్తామన్నారు. ఎంతమంది డెంగీ బారినపడ్డారో, వైద్య సేవలు ఏమేరకు అందించారో తెలియజేయాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.

No comments:

Post a Comment