విజయవాడ అక్టోబర్ 31 (way2newstv.in):
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్వాగతించారు. ఆయన గురువారమిక్కడ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారని అభినందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు.
ఆర్టీసీని కాపాడటాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. లాభాలు వచ్చే మార్గాల్లో ప్రయివేట్ బస్సులు నడుపుతారని, నష్టాలు వచ్చే మార్గంలో ప్రయివేట్ ఆపరేటర్లు బస్సులు నడపరని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని కేశినేని నాని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కాన్సెప్ట్ చాలా గొప్పదన్నారు. మంచిపని చేశారని తనకు అనిపించింది కాబట్టే చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని కుటుంబం కార్మిక పక్షపాతి అని ప్రశంసించారు.
No comments:
Post a Comment