Breaking News

07/09/2019

మీది.. 500వ దాడి..

విజయవాడ, సెప్టెంబర్ 7, (way2newstv.in)
పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతోన్న దాడులపై టీడీపీ మండిపడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు గత రెండు వారాలుగా పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఏకంగా వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం కొనసాగుతుండగానే అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. 
మీది.. 500వ దాడి..

పుట్టపర్తి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల తలలు పగలగొట్టారంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ, జగన్ టార్గెట్‌గా ఘాటు ట్వీట్లు చేశారు.‘పుట్టపర్తి నియోజకవర్గం మైలసముద్రం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలపై రాళ్లతో దాడిచేశారు. ఆడవాళ్లు, వృద్ధులు అనే కనికరం కూడా లేకుండా తీవ్రంగా గాయపరిచారు. @ysjagan గారూ.. మీ పాలన 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంలో 500వ దాడిని మీకు అంకితం చేశారు మీ వైకాపా మృగాలు!’అంటూ మండిపడ్డారు.గత ఐదేళ్లుగా పచ్చని తివాచీ పరుచుకున్న ఆంధ్ర రాష్ట్రం, నేడు మీ తుగ్లక్ పరిపాలనలో రక్తమోడుతోంది. వైకాపా రాక్షసులకు తెదేపా కార్యకర్తల రక్తం కళ్లచూడందే నిద్ర పట్టడంలేదనుకుంటా. ఇకనైనా ఈ మారణహోమం ఆపండి. లేదంటే కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు’అంటూ హెచ్చరించార లోకేష్

No comments:

Post a Comment