Breaking News

07/09/2019

ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే

హైద్రాబాద్, సెప్టెంబర్ 7, (way2newstv.in)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై స్పష్టత లేకపోయినా... హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంసమాయత్తమవుతోంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలతో కలుపుకుంటే తెలంగాణలోని మొత్తం 120కి పైగా మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్నీఎక్కువ సీట్లు సాధించి... మరోసారి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. వందకు పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనికేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే

అయితే ఈ టార్గెట్‌ను సాధించే బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కువగా ఎమ్మెల్యేలపైనే పెట్టబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది. టీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే గులాబీ దండుకు వందకు పైగా ఎమ్మెల్యేల బలం ఉంది. వీరందరినీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసంవినియోగించుకోవాలని కేటీఆర్ డిసైడయినట్టు సమాచారం.మున్సిపల్ ఎన్నికలతో తమకు సంబంధం లేదని భావిస్తున్న నగర ఎమ్మెల్యేలు కూడా ఇతర జిల్లాలు లేదా ఇతర మున్సిపాలిటీల్లోటీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు తీసుకోవాల్సిందే అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ఎదురుచూస్తున్ననేపథ్యంలో... ఈ రెండు పార్టీలను బలంగా ఎదుర్కోవడంపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.మరీ ముఖ్యంగా బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో కట్టడి చేయడం ద్వారా ఆపార్టీలోకి వలసలు లేకుండా చేయొచ్చని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోందని పార్టీ వర్గాల్లో చర్చ

No comments:

Post a Comment