హైద్రాబాద్, సెప్టెంబర్ 17 (way2newstv.in)
పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పుటు చేసుకోవడంతో పట్టణీకరణ పెరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యుల అడిగి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రణాళికబద్ధంగా పురోగతి ఉండాలి. దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు రూపొందించాం. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. పట్టణీకరణలో మన రాష్ర్టానికి ఐదోస్థానం ఉంది. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సేవ చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే కొత్త మున్సిపాలిటీ చట్టం తెస్తున్నాం.
పట్టణీకరణలో తెలంగాణ ఐదో స్థానం
కొత్త మున్సిపాలిటీ చట్టంలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం అమలులోకి తెస్తున్నాం. సచ్ఛభారత్, స్వచ్ఛసర్వేక్షణ్‌ను అమలు చేస్తున్నాం. సత్వరమే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే విధానం తెచ్చాం. స్వచ్ఛభారత్‌లో భాగంగా రాష్ట్రంలో వందశాతం ఓడీఎఫ్‌లు సాధించుకున్నాం.సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం. ప్రతి మున్సిపాలిటీలోనూ పెద్ద ఎత్తున హరితహారం అమలు చేస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఇంకా మెరుగ్గా చేయాలన్న సూచనను పరిగణలోకి తీసుకున్నాం. తడి, పొడి వ్యర్థాల నిర్వహణలో మనం పురోగతి సాధిస్తున్నాం. అర్భన్ డెవలప్‌మెంట్ అధారిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి సారించాం. దేశంలో ఐదో అతిపెద్ద నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో వేగవంతంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం. మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా చేస్తున్నాం.
No comments:
Post a Comment