Breaking News

16/09/2019

బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ ఏరియల్‌ సర్వే

రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన జగన్‌
మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశం
విజయవాడ, సెప్టెంబర్ 16, (way2newstv.in),
బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు.  లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఒక్కొక్క బాధితుడి దగ్గరకు స్వయంగా వెళ్లి  ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్‌  వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, తదితరులు ఉన్నారు.315 అడుగుల లోతులో లాంచీగోదావరిలో మునిగిన బోటును ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కనుగొంది. లాంచీ 315 అడుగుల లోతుకు మునిగిపోయినట్లుగా గుర్తించారు. 
బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి  జగన్‌ ఏరియల్‌ సర్వే
ఎక్కువ లోతు, ప్రవాహం ఉధృతంగా ఉండడంతో లాంచీ వెలికి తీసేందుకు ఎక్కువ సమయం పడుతుందని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తెలిపింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది లాంచీలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.మరో నాలుగు మృతదేహాలు వెలికితీత ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మరో నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12 కి చేరింది. తాజాగా వెలికి తీసిన మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నారి కూడా ఉండటం పలువురిని కలిచివేస్తోంది. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బోట్లతో విస్రృతంగా గాలిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం జగన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.మృతదేహాల తరలింపుకు అంబులెన్స్‌ల ఏర్పాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని మంత్రి కన్నాబాబు తెలిపారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు.ధవళేశ్వరం వద్ద కుండపోత వర్షం ధవళేశ్వరం వద్ద గేట్లు మూసివేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు బోట్లతో గోదావరిలో గాలింపు జరుపుతున్నారు. లాంచీ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం కాటన్ బ్రిడ్జి వద్ద వలల వేయించారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద కుండ పోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.ముమ్మరంగా సహాయక చర్యలు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్‌ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఒక నావీ చాప్టర్, ఓఎన్‌జీసీ చాప్టర్‌ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.

No comments:

Post a Comment