Breaking News

16/09/2019

తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది : కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాద్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఓ ట్వీట్ చేశారు.కాగా, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్పందిస్తూ, కోడెల మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. కోడెల లాంటి ధైర్యవంతుడికి ఇలాంటి ముగింపు ఊహించలేదని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడం దారుణమని అన్నారు.  
తీవ్ర దిగ్భ్రాంతి  కల్గించింది : కేసీఆర్
చాలా బాధ కల్గించింది : చంద్రబాబు
కోడెల శివప్రసాదరావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడెల శివప్రసాద్ కు నివాళులర్పించారు. ఒక సహచరుడిని కోల్పోయిన బాధ, సీనియర్ నేతను కోల్పోయిన బాధను భరించలేకపోతున్నానని అన్నారు. కోడెల ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోతున్నానని, కోల్కోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ మానసిక క్షోభకు, భరించలేని అవమానానికి గురయ్యారని, తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. నందమూరి బాలకృష్ణ తనకు ఫోన్ చేసి కోడెల మృతి వార్తను చెప్పడంతో షాక్ కు గురయ్యానని, జీర్ణించుకోలేకపోయానని, ‘చాలా బాధ కలిగింది, మనసు కలిచివేస్తోంది’ అని అన్నారు
మానసిక ధైర్యం ఇవ్వాలి : పవన్
గుంటూరు జిల్లా రాజకీయ దిగ్గజం, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన మృతికి తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేశారు. రాజకీయపరమైన ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుదిశ్వాస విడవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఓ ప్రకటనలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. కోడెల రాజకీయనాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా ఎన్నో పదవులు చేపట్టారని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
రాజకీయం చేయవద్దు : శ్రీకాంత్ రెడ్డి

No comments:

Post a Comment