Breaking News

24/09/2019

ఘాటెక్కిన ఉల్లి ధరలు

న్యూఢిల్లీ సెప్టెంబర్ 24 (way2newstv.in)    
ఉల్లిపాయ ధరలు కొండెక్కాయి. రోజురోజుకు ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోవడంతో.. కొనలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఉల్లిపాయలు లేని వంట రుచిగా ఉండకపోవడంతో.. తప్పనిపరిస్థితుల్లోఉల్లిపాయలను కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ. 80గా పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో ఉల్లిపాయలను రూ. 40 నుంచి రూ.50లకు అమ్ముతున్నారు. 
ఘాటెక్కిన ఉల్లి ధరలు

పెరిగిన ధరలప్రభావంతో ఢిల్లీలో ఉల్లిపాయలను కేంద్ర ప్రభుత్వమే విక్రయిస్తోంది. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసిన కేంద్రం.. ఢిల్లీలో కిలో ఉల్లిపాయలను రూ. 22కే అమ్ముతోంది. దీంతో ఉల్లిపాయ విక్రయ కేంద్రాలవద్ద జనాలు బారులు తీరారు. ఢిల్లీ మార్కెట్‌లో అయితే కిలో ఉల్లిపాయల ధర రూ. 75 నుంచి రూ. 80గా ఉంది.బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్‌లో అయితే రూ. 60, హైదరాబాద్‌లో అయితే కిలో ఉల్లిపాయల ధర రూ. 41 నుంచి రూ.46 మధ్య ఉంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగుతగ్గింది. దీంతో ఉల్లి సరఫరాకు డిమాండ్‌ పెరిగింది. ఇలాగే వర్షాలు కురిస్తే ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక బీహార్‌లో రూ. 8 లక్షల ఖరీదు చేసే ఉల్లిపాయలను గుర్తు తెలియని వ్యక్తులుదొంగిలించారు. మహారాష్ట్రలో రూ. లక్ష ఖరీదు చేసే ఉల్లిపాయలను దొంగిలించినట్లు కేసు నమోదైంది.

No comments:

Post a Comment