Breaking News

20/09/2019

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరొగ్యం సాధ్యం

జిల్లా   కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి  ,సెప్టెంబర్ 20  (way2newstv.in)
మనం పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరొగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు.  కేంద్ర ప్రభుత్వ  సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, క్షేత్ర ప్రచార విభాగంలో  శుక్రవారంకమాన్ పూర్ కేశవ గార్డెన్స్ లో  స్వచ్చ్ భారత్,  పోషన్ అభియాన్ ల పై నిర్వహించిన ప్రత్యేక సదస్సులో కలెక్టర్ పాల్గోన్నారు.   ఈ కార్యక్రమంలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  పారిశుద్ద్యం ,గ్రామాభివృద్దికి తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాల పై   ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.  అదే విధంగా గేయ,  నాటక విభాగం వారిక కళాకారుల బృందం  తమకళారూపాల ద్వారా  ప్రజలకు వివరించారు. 
పౌష్టికాహారంతో సంపూర్ణ  ఆరొగ్యం సాధ్యం

అనంతర జిల్లా కలెక్టర్ మాట్లాటడుతూ గ్రామాల సంపూర్ణ అభివృద్ది  ధ్యేయంగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన  30 రోజుల ప్రత్యేక కార్యచరణలో చాలా వరకుకేంద్ర ప్రభుత్వ  కార్యక్రమాలు సైతం  సమాంతరంగా అవలు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు.  స్వచ్చతా హి సేవా కార్యక్రమం ద్వారా  11 సెప్టెంబర్ 2019 నుంచి 02 అక్టోబర్ 2019 వరకు జిల్లాలోఉన్న ప్లాస్టిక్ ను సేకరించి , దానిని మరో సారి ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని, మన  30 రోజుల ప్రత్యేక కార్యచరణలో సైతం మనం   ప్లాస్టిక్ నుసేకరిస్తూ  వాటి నివారణకు కృషి చేస్తున్నామని కలెక్టర్ అన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ద్యం,  పర్యావరణ  సమతుల్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని  కలెక్టర్ తెలిపారు.  మన పెద్దపల్లిజిల్లాలో   ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసి ఒడిఎఫ్  గాప్రకటించామని,  గత సంవత్సరం  జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ప్రజల భాగస్వామ్యం ద్వారా మన పెద్దపల్లి జిల్లాజాతీయ స్థాయిలో  స్వచ్చ్ సర్వేక్షణ్ లో గుర్తింపు సాధించిందని కలెక్టర్ అన్నారు.  30 రోజుల  ప్రత్యేక కార్యచరణలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతిలో డంపింగ్ యార్డు నిర్మించి,  చెత్త నిర్వహణకుపకడ్భంది  ప్రణాళిక రుపొందిస్తున్నామని,  జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రస్తుతం  తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  ప్రస్తుతం పర్యావరణ సమతుల్యత సరిగ్గా లేదని,పూర్వం మన పెద్దలు  పర్యావరణానికి అనుకులంగా జీవించే వారని, ప్రస్తుత పరిస్థితులలో మనం చాలా వరకు ప్రకృతి వినాశానానికి దొహదపడుతున్నామని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేసారు.  పూర్వంగ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూరగాయలు పండించే వారని, రైతులు   ఆర్గానిక్  ఎరువులను  తయారు చేసుకునే వారని, ప్రస్తుతం అధిక సంఖ్యలో  రసాయన ఎరువులు ఉపయోగిస్తున్నామని,ఎక్కడ కూరగాయల పెంపకం జర్గడం లేదని కలెక్టర్ తెలిపారు.  మన జిల్లాలో  గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని మనం బ్యాన్ చేస్తున్నామని, అయినప్పటికి  ప్రతి గ్రామంలో ప్రతి చిన్న విషయానికిఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారని,  ఎవరైనా చనిపోయినా, పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రతి చిన్న అంశానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదని, దీని నివారించాలని  కలెక్టర్ ప్రజలను కోరారు.  మన గ్రామంలో మనం ఏ చిన్న వస్తువు కోనుగొలు చేయాల్సి వచ్చిన  ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నామని, వీటిని పూర్తి స్థాయిలో నివారించాలని , వీటి స్థానంలో మనపెద్దపల్లి జిల్లాలో తయారు చేస్తున్న క్లాత్ బ్యాగ్ లను వినియోగించాలని కలెక్టర్ సూచించారు.   మన పెద్దపల్లి జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళల చే  క్లాత్ బ్యాగ్ తయారీ కేంద్రాని ఇటీవల మంత్రిగారిచే ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం  పై నిషేదం విధించి, గ్రామ సర్పంచ్లు తమకు అవసరమున క్లాత్ బ్యాగ్ ల  వివరాలతో కూడిన ఆర్డర్లను అందిస్తే అతితక్కువ సమయంలో అందించడం జరుగుతుందని,  వివిధ సైజులలో క్లాత్ బ్యాగుల తయారీ జరుగుతుందని కలెక్టర్ వివరించారు.  మనం ఆరొగ్యంగా ఉండాలంటే  పరిశుభ్రమైన పరిసరాలతో పాటుమంచిపౌష్టికాహారం తీసుకోవాలని, ప్రస్తుతం జిల్లాలో  చాలా మంది మహిళలు  అనేమియా వ్యాధితో బాధపడుతున్నారని,  అనేమియా వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని, వీటిని నివారించడానికి  మంచి పౌష్టికాహారం తీసుకోవాలని,  గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాల్లో సిబ్బంది సూచించిన విధంగా గర్బవతులు మంచి ఆహారం తీసుకోవాలని, మన పిల్లలకు సైతం మంచి ఆహారం అందించాలనికలెక్టర్ తెలిపారు.  ఆకుకూరులు అధికంగా తీసుకోవాలని, దీని వల్ల రక్త హినత తగ్గుతుందని కలెక్టర్ అన్నారు.  ఎనిమియా వల్ల గర్బవతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని , చాలా సార్లుతల్లి ప్రాణాలకు, పిల్లల ఆరొగ్యానికి హాని కల్గుతుందని కలెక్టర్ అన్నారు.  మనం మన ఇంటిని పరిశుభ్ర్రంగా ఉంచుకున్న విధంగా మన గ్రామాన్ని సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాల్లో రోడ్ల పైచెత్త వేస్తే  నూతన చట్టం ప్రకారం జరిమానా విధించడం జర్గతుందని కలెక్టర్ అన్నారు.  జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి  ఇంటికి సోక్  పిట్ నిర్మాణం పూర్తి చేయడం వల్ల  మురికి కాల్వలనునిర్మూలించుకున్నామని , తద్వారా గత సంవత్సరం  213 డెంగ్యూ కేసులు , 17 చికెన్ గున్యా కేసులు నమోదు అయితే ప్రస్తుతం కేవలం 17  డెంగ్యూ కేసులు,4 చికెన్ గున్యా కేసులు నమోదుఅయ్యాయని అన్నారు.  .     జిల్లాలోని ప్రతి పాఠశాలలో  పిల్లలకు పౌష్టికాహర లోపం, దాని నివారణ తీసుకోవాల్సిన చర్యల  పై అవగాహన కల్పిస్తున్నామని , ప్రతి పాఠశాలలో  పౌష్టికాహారంతీసుకోవడం వల్ల కలిగే లాభాల పై చర్చ జరగాలని,  ప్రతి పాఠశాలలో  కిచెన్  గార్డెన్ ఏర్పాటు చేయాలని, పోషణ్ అభియాన్ విజయవంతం కావడంలో విద్యార్థులు, మహిళా సంఘాలు, యువకులు  కొంత క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ తెలిపారు.   అనంతరం జిల్లా కలెక్టర్  పోషణ్ అభియాన్, స్వచ్చ్ భారత్ అంశాల పై  నిర్వహించిన పొటిలలో విజేతలుగా నిలిచిన  విద్యార్థులకు బహుమతులు అందించారు.  కలెక్టర్ విద్యార్థులచే  పోషణ్ అభియాన్ , స్వచ్చ్ భారత్ పై అవగాహన కల్పిస్తూ కేశవ  గార్డెన్స్ నుంచి  మార్కెట్ వరకుర్యాలీ నిర్వహించి   ప్రజలకు క్లాత్  బ్యాగులను పంపిణీ చేసి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం నివారించాలని కోరారు. వరంగల్ , కరీంనగర్ జిల్లాల  క్షేత్రప్రచారం అధికారి  అర్థ శ్రీనివాస్ పటేల్,  మండల విద్యశాఖ అధికారిసంపత్ రావు, గ్రామ సర్పంచ్  సరిత, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

No comments:

Post a Comment