Breaking News

24/09/2019

తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదేంటీ

హైద్రాబాద్, సెప్టెంబర్ 24, (way2newstv.in)
అవును ! క‌మ‌ల ద‌ళానికి ఏమైంది ? రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు. విభ‌జ‌న‌తో ఇబ్బందుల్లో ఉన్న ఏపీ, అదే కార‌ణంగా కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న తెలంగాణ‌ను కూడా బీజేపీ ప‌ట్టించు కోక‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక ల్లో ఏపీ నుంచి ఎవ‌రూ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. పోటీ చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఫెయిల‌య్యారు. దీంతో ఇక్క‌డ అటు అసెంబ్లీకి కానీ, ఇటు పార్ల‌మెంటుకు కానీ బీజేపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై స్పందించి, ప‌రిష్క‌రించేందుకు బీజేపీ నుంచి ఎవ‌రూ ముందుకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది.క‌ట్ చేస్తే.. ఏపీ ప‌రిస్థితి తెలంగాణ‌లో భిన్నంగా ఉంది. ద‌క్షిణాదిన ఎద‌గాల‌ని భావించిన బీజేపీ.. ఆదిశ‌గా వేసిన అడుగులు తెలంగాణ‌లో స‌క్సెస్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ న‌లుగురు ఎంపీల‌ను ఆ పార్టీ గెలుచుకుంది. 
తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదేంటీ

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన నిజామాబాద్ ఎంపీ స్థానంలోనూ గెలుపు గుర్రం ఎక్కి కాషాయ ప‌తాకాన్ని రెప‌రెప‌లాడించింది. అయితే, వీరంతా గెలుపు గుర్రం ఎక్కి వంద రోజులు పూర్త‌యినా కీల‌క‌మైన ఎన్నిక‌ల హామీలు కానీ, రాష్ట్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యం కానీ .. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ప‌రిస్థితి ఉండ‌డం గ‌మ‌నార్హం.కిష‌న్ రెడ్డికి కేంద్రంలో స‌హాయ మంత్రి ప‌ద‌విని ఇచ్చి స‌రిపెట్టారు. అంతే త‌ప్ప తెలంగాణ‌కు చేసింది లేదు. కానీ, కీల‌క‌మైన ప‌సుపు బోర్డు విష‌యంలో నిజామాబాద్ రైతులు గంపెడాసెలు పెట్టుకుని బీజేపీని గెలిపించారు. కానీ,ఇప్ప‌టి వ‌రకు ఈ ముచ్చ‌ట గురించి మాట్లాడే దిక్కేలేదు. కేంద్రంలో స‌హాయ మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి రాష్ట్రానికి ఏదైనా సాధిస్తార‌ని చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఇప్ప‌ట్లో అదిసాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌ల శ‌రాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఇక‌, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ప‌రిస్థితి చిత్రంగా ఉంది.ఆయ‌న ఆదివాసీ వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆదివాసీ హ‌క్కుల కోసం పోరాటం అంటూ మొద‌లు పెట్టి కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. ఇప్పుడు ఎంపీ అయ్యారు. మ‌రి ఆయ‌న ఏం చేయాలి? స‌ద‌రు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు పార్ల‌మెంటులో గ‌ళం వినిపించాలి. కానీ, త‌స్సాదియ్యా.. మ‌ళ్లీ ఆదివాసీల హ‌క్కులంటూ.. బీజేపీ ఎంపీగా ఉంటూనే ఉద్య‌మాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రి ఇదేం చిత్ర‌మో ఆయ‌నే గ్ర‌హించాలి. ఎర్రజొన్న – పసుపు – పొగాకు రైతులకు మద్దతు ధర – పసుపు – పొగాకు బోర్డుల ఏర్పాటు హామీతో నిజామాబాద్‌లో నెగ్గుకొచ్చిన ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఆత‌ర్వాత వీటిని ప‌క్క‌కు పెట్టారు.దీంతో ఇప్పుడు ఇక్క‌డ గ‌త ఎంపీ క‌వితే బెట‌ర్ అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. భారీ ఫాలోయింగ్ ఉన్న బండి సంజయ్ విషయంలోనూ కరీంనగర్ ప్రజలు ఎంతో ఆశించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే కరీంనగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థిగి గెలిస్తే బాగుపడుతుందని ఆశించారు. కానీ మునుపటికి కంటే కూడా చెత్తగా మారిపోవడం చూసి ఇప్పుడు మద‌నపడుతున్నారట. ఇలా మొత్తానికి బీజేపీకి ద‌క్షిణాదిలోని కీల‌క‌మైన తెలంగాణ రాష్ట్రం న‌లుగురు ఎంపీల‌ను క‌ట్ట‌బెడితే.. వారివ‌ల్ల ఒరిగింది శూన్యం. మ‌రి ఈ రకంగా ముందుకు వెళ్తూ.. ఏర‌కంగా అభివృద్ధి చెందాల‌ని పార్టీ భావిస్తోంద‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.

No comments:

Post a Comment