Breaking News

11/09/2019

ఇక సిటీలో ట్రాఫిక్ మల్టీ లెవల్ పార్కింగ్

హైద్రాబాద్, సెప్టెంబర్ 11, (way2newstv.in)
మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్, రద్దీని దృష్టిలో పెట్టుకుని దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీలెవెల్ పార్కింగ్‌ను అందుబాటులోకి రానుంది. నాంపల్లి మెట్రోరైలు స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న మల్టీలెవెల్ పార్కింగ్‌కు శ్రీ కారం చుట్టారు.  రెండుసార్లు ఈ పార్కింగ్‌కు టెండర్లను ఆహ్వానించినా,సంస్థలు ముందుకు రాలేదని, మూడోసారి టెండర్‌ను చేజిక్కించుకుని పనులు చేపట్టేందుకు సిద్ధమైన టెక్నోక్రాట్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థను అభినందించారు.  రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్యవెచ్చించి నిర్మిస్తున్న ఈ మల్టీలెవెల్ పార్కింగ్ సదుపాయం మరో తొమ్మిది నెలల్లో అందుబిటులోకి తెచ్చేలా పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 
ఇక సిటీలో ట్రాఫిక్  మల్టీ లెవల్ పార్కింగ్

ఇందుకు వచ్చిన నిధులను ఇందులోని కమర్షియల్ స్థలాన్ని లీజ్‌కు ఇచ్చి, తిరిగి సమకూర్చుకోనున్నట్లు ఆయన వివరించారు. ఈ పార్కింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దిల్లీ కన్నా ఎక్కువ బిజినెస్ లావాదేవీలు నగరంలో ఊపందుకుంటాయని తెలిపారు. ఈ అరుదైన టెక్నాలజీతో నిర్మిస్తున్న 15 అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్సును మొట్టమొదటి సారిగా తొమ్మిది నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసేందుకు టెక్నోక్రాట్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థ అంగీకరించినట్లు తెలిపారు. ఈ పార్కింగ్ కాంప్లెక్సు మొత్తం ఆటోమెటిక్‌గా పనిచేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం ఇలాంటి 40 మల్టీలెవెల్ పార్కింగ్‌లకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వివరించారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ ప్రాతిపదికన నిర్మించనున్న ఈ కాంప్లెక్సుల్లో తగిన సదుపాయాలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ పార్కింగ్ కాంప్లెక్సుల్లో కార్ల పార్కింగ్‌ను స్మార్ట్ కార్డు ద్వారా అనుమతించనున్నట్లు, ఇందులో షాపింగ్ కోసం వచ్చిన వారు తమ షాపింగ్‌ను ముగించుకున్న వెంటనే వారున్న స్టాల్‌కు కారు ఆటోమెటిక్‌గా వచ్చే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment