Breaking News

11/09/2019

ఓరుగల్లులో కమలం వికాసం

వరంగల్, సెప్టెంబర్ 11, (way2newstv.in)
రుగల్లులో బీజేపీ దూకుడు పెంచింది…  సెకెండ్ క్యాడర్ తో మొదలెట్టి… ఎంపీ గరికపాటి తో స్పీడప్ చేసి  రేవూరి చేర్చుకోవడంతో  జిల్లాలో టీడీపీని ఫినిష్ చేశారు కమల నాథులు. మరోవైపు  మాజీ ఎమ్మెల్యే కొండేటితో కాంగ్రెస్ నుంచి వలసలు మొదలు పెట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో  బలోపేతానికి  బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రజా క్షేత్రంలో మంచి పట్టున్న నేతలను ఆకర్షిస్తోంది. టీడీపీ ఖాళీ కావడం.. కాంగ్రెస్ లో కొందరు టచ్ లోకి రావడంతో  ఇక  టీఆర్ఎస్ నేతలపై దృష్టిపెట్టారు. త్వరలోనే జరిగే మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా బిజీపే ముందుకెళుతోంది.ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టుగా ఉండే వరంగల్ లో పార్టీ బలోపేతానికి ప్రత్యేక ప్లాన్ తో బీజేపీ అడుగులు వేస్తోంది. 
ఓరుగల్లులో కమలం వికాసం

వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను తమవైపు లాక్కునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.  వరంగల్ అర్భన్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లోని టీడీపీ నేతలంతా బీజేపీలో చేరిపోయారు.ఇక  కాంగ్రెస్  పార్టీలో అసంతృప్త నాయకులను ప్రత్యేకంగా కలిసి ఒప్పిస్తున్నారు కమల నాథులు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు లాంటి నేతలు పార్టీలో చేరారు. మరికొందరితోనూ బీజేపీ ముఖ్యనేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ పైనా ప్రత్యేక దృష్టిపెట్టారు కమలనాథులు. పదవులు దక్కక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్లు రాని అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళ్తోంది బీజేపీ. గతంలో పట్టున్న పరకాల, నర్సంపేట లో కాషాయం జెండా ఎగరేయాలని, మిగతా మహబూబాబాద్, జనగామ లాంటి ప్రాంతాల్లో సత్తా చాటాలని క్యాడర్ కు నిర్ధేశిస్తున్నట్లు సమాచారం. రేవూరితో నర్సంపేటపై పట్టుసాధించవచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు.బీజేపి పాగా వేసేందుకు లోతైన ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజాభిమానాన్ని పొందడంలో విఫలమయ్యాయి కాబట్టి, అదికార పార్టీకి ప్రత్యామ్నాయం ఇప్పుడు బీజేపి మాత్రమే ననే సంకేంతాలు తెలంగాణ ప్రజానికానికి చేరవేసి, తద్వారా లబ్దిపొందాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాల్లో గెలపు తెలంగాణలో బీజేపికి కొత్త ఆక్సీజన్ లా పరిణమించింది. ఆ నాలుకు లోక్ సభ స్థానాల్లో గెలుపు ఇచ్చిన మనో స్త్యైర్యాన్ని భవిశ్యత్తులో కొనసాగించేంకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపి. తెలంగాణలో అదికారంలోకి రావడమే లక్ష్యంగా కషాయ పార్టీ వినూత్న వ్యూహం రచిస్తోంది.సీఎం చంద్రశేఖర్ రావు కూడా ఏవో ముతక సామెతలతో నాల్రోజులు మభ్యపెట్టనూ వచ్చు. అంతటితో అంతర్గత కుమ్ములాటలు సద్దుమణుగుతాయా? అసలెందుకీ అకస్మాత్తు వివాదాలు? పార్టీలకతీతంగా అందరి చూపులూ బీజేపీ వైపు చూస్తున్నాయి. ఇదంతా నిజమా? ఒట్టి బూటకమా అనే విషయాలను పక్కనబెడితే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోయింది, తెలుగుదేశం పార్టీ గులాబీ కారు చక్రాల క్రింద ఎప్పుడో నలిగిపోయింది. ఇక మిగిలింది గులాబీ పార్టీ. అది కూడా ప్రజా వ్యతిరేక ప్రవాహంలో కొట్టుకుపోయే పార్టీనే అనేది బీజేపీ నేతల ధీమాగా తెలుస్తోంది.మరో నాలుగేళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగే సమయంలోనే అంతర్గత వైరుద్యాలకు ఆజ్యం పోసి, కోలుకోలేని దెబ్బకొట్టి, తెలంగాణ వ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించాలనే బీజేపి కలను సాకారం చేయాలనేది అమిత్ షా వ్యూహమని స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా కమలం పార్టీ నుంచి సౌందరరాజన్ కు తెలంగాణ గవర్నర్ గిరి అప్పగించారు. నరసింహన్ కూడా అదే తమిళనాడు నుంచి వచ్చినా, చాలా తెలివిగా కేంద్రానికి చెప్పాల్సిన వన్నీ చెబుతూ అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పెద్దల మనసు దోచుకున్నారు. ఇదే నరసింహన్ కు కేంద్రంలో కీలకమైన పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment