Breaking News

23/09/2019

15 శాతం అదనపు నష్ట పరిహారం

నంద్యాల సెప్టెంబర్ 21, (way2newstv.in)
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరదబాధితులకు, పంట నష్టం వాటిల్లిన ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం ఇస్తున్న నష్ట పరిహారానికి 15 శాతం అదనంగా కలిపి వరద, పంట నష్టం వివరాల నివేదికలను ఇవ్వండని  అధికారులను  జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.
 15 శాతం అదనపు నష్ట పరిహారం

ముఖ్యమంత్రి పర్యటన తరువాత అయన నంద్యాల డివిజన్ వరదలపై మునిసిపల్ ఆఫీసు మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు, కలెక్టర్ వీరపాండియన్ తదితరులు ఈ భేటీకి హజరయ్యారు.వరద బాధితులకు, వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని, బియ్యం తదితర నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేసారు.

No comments:

Post a Comment