Breaking News

23/09/2019

గ్రామాల రూపురేఖలు మార్చడంలో ప్రజలందరూ భాగాస్వామ్యులు కావాలి

మురుగు కాల్వల లో,రోడ్డు పై  చెత్త వేసిన వారిపై జరిమానా ఖచ్చితంగా విధించాల్సిందే.
శ్రమదానం తో పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి.
 ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలి
 ప్రతి డంప్ యార్డ్ లలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయాలి
సిరిసిల్ల, సెప్టెంబర్ 21 (way2newstv.in):
గ్రామాల రూపురేఖలు మార్చడానికి ప్రజలందరూ భాగాస్వామ్యులు కావాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామ సేవకులుగా సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు సత్వర అభివృద్ధిని సాధిస్తాయని జిల్లా కలెక్టర్  కృష్ణభాస్కర్ అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు  సమిష్టిగా  ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు . గ్రామాలలో పచ్చదనం పెంపుతో పాటు  పారిశుద్ద్యం  మెరుగ్గా ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని  కలెక్టర్  కోరారు .శనివారం కోనరావుపేట మండలంలోని కొండాపూర్, నిమ్మపెల్లి గ్రామాలలో30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణ తో కలిసి  కలెక్టర్ క్షేత్ర స్థాయిలో  పరిశీలించారు. గ్రామ  సభలలో పాల్గొన్నారు . 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సందర్భంగా  గ్రామాలలో  ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య , హరితాహారం , పనులు , విద్యుత్ కమిటీ లు , వాటి పనితీరు , ఇప్పటి వరకు గుర్తించిన పనులు , పూర్తీ చేసిన పనులు , పెండింగ్ పనులు , ప్రతిబంధకాల ను కమిటీ కన్వీనర్ లు , సభ్యులను అడిగి సంక్షిప్తంగా తెలుసుకున్నారు. 
గ్రామాల రూపురేఖలు మార్చడంలో ప్రజలందరూ భాగాస్వామ్యులు కావాలి

కమిటీ ఏర్పాటు ,ఉద్దేశ్యాల ను ప్రజలకు కలెక్టర్ సమగ్రంగా వివరించారు. గ్రామాల పర్యటన లో పారిశుద్ద్యం , రోడ్డు వెంబడి మొక్కల పెంపకం ను పరిశీలించారు.మొక్కల సంరక్షణ ఏ విధంగా చేస్తున్నారో అధికారులను  అడిగి తెలుసుకున్నారు. నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలు బ్రతకాలని, లేదంటే బాధ్యుల పై  కఠినంగా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు . పలు వీదులలో చెత్త పేర్కొని పోవడం, వర్షాలకి కురసిన నీరు నిలిచిపోయి ఉండడం గమనించిన ఆయన, ఆ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఎవరైనా రోడ్డుపై చెత్త వేసినా, చెత్తను కాల్చివేసినా 500 రూపాయల జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్ గ్రామ కార్యదర్శులను ఆదేశించారు.ఈ 30 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత ఉండేలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి  ప్రజల సహకారంతో కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. అలాగే ప్రజలు శ్రమదానంతో  దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  ప్రజల సహకారంతో   శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని,పాడుబడిన బావులను పూడ్చివేయాలని  ఖాళీ స్థలాల్లోని పిచ్చి మొక్కలను తొలగించాలని డ్రైనేజీ లను శుభ్రం చేయాలని మురికి కాలువలో ఇరుక్కుపోయిన చెత్తను చెదారాన్ని తొలగించాలని అన్నారు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామంలో పచ్చదనం పెంచేందుకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కృషి చేయాలన్నారు. వంగిన స్తంభాలను సరిచేయాలని తుప్పుపట్టిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు రోజూ గ్రామాలను తప్పకుండా సందర్శించాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.గ్రామాల ప్రజలు తమ ఇంటి ఆవరణలో తప్పకుండా ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. తద్వారా భూగర్భ జల మట్టం పెరగడంతో పాటు ..గ్రామాలలో ఎక్కడా మురుగునీరు రోడ్ల పై పారే పరిస్థితి ఉండదన్నారు . ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటుందన్నారు. పనులు జరగకపోతే ఫిర్యాదు చేయండి : జిల్లా కలెక్టర్పల్లెలలో పారిశుద్యం ,పరిశుభ్రత పెంపొందించడమే లక్ష్యంగా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమ అమలును ప్రభుత్వం చేపట్టిందన్నారు . ఈ కార్యక్రమం ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు .గ్రామాలలో  కార్యక్రమం సరిగా  అమలు కాకుంటే ప్రజలు మొబైల్ నెంబర్ 6309141122 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే  వాట్సప్ నెంబర్  9963340934 కు అపరిశుబ్రత పరిసరాల ఫోటోలను పంపించాలాన్నారు . గ్రామాలలో జరుగుతున్న ఈ కార్యక్రమ అమలు తీరును పరిశీలించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తిరుగుతున్నాయని, ఈ ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గ్రామాలకు ర్యాంకులు కేటాయిస్తామన్నారు. ర్యాంకు లలో వెనుకబడిన గ్రామాల అధికారులు పై చర్యలు తీసుకుంటామన్నారు.అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధిని సాధించగలుగుతాంజిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణతెలంగాణ లోని గ్రామాలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా  తీర్చిదిద్దేందుకు సీఎం   కేసీఆర్ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అయి కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధిని సాధించగలుగుతాం అని జిల్లా  ప్రజా పరిషత్ చైర్ పర్సన్  న్యాలకొండ అరుణ అన్నారు.నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ గ్రామాలలో పరిశుభ్రత ,పచ్చదనం పెంపుకు కృషి చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో డీపీవో  రవీందర్ , ఎంపిపి  చంద్రయ్య గౌడ్, ఎంపీడీవో  రామకృష్ణ, తహశీల్దార్  రమేష్   స్థానిక ప్రజా ప్రతినిధులు , అధికారులు , గ్రామ ప్రజా  ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment