Breaking News

14/08/2019

తోర్నాల పాఠశాలలో ప్లేట్లు, గ్లాసులు పంపిణి చేసిన ఏసిపి రామేశ్వర్

సిద్దిపేట రూరల్, ఆగస్టు 14 (way2newstv.in)
సిద్దిపేట మండలం తోర్నాల గ్రామం ప్రైమరీ స్కూల్ బాలబాలికలకు సిద్దిపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం స్టీల్ ప్లేట్లు, గ్లాసులను ఏసిపి రామేశ్వర్  పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామేశ్వర్  పాల్గొని చిన్నారి  బాలబాలికలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. 
తోర్నాల పాఠశాలలో ప్లేట్లు, గ్లాసులు పంపిణి చేసిన ఏసిపి రామేశ్వర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట వాసవి క్లబ్ సేవలు అమోఘంగా ఉన్నాయని చాలా సందర్భాల్లో ప్రజలకు సేవ చేయడంలో వాసవి క్లబ్ యాజమాన్యం ముందు ఉంటుందని అభినందించారు.  బాలబాలికలు మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు వాసవి క్లబ్ డైరెక్టర్ భాస్కర్  సభ్యులు కలసి  ఏసిపి ని శాలువాతో సన్మానించారు.

No comments:

Post a Comment