Breaking News

14/08/2019

కాకతీయ టెక్నో స్కూల్ లో ఘనంగా రక్షాబంధన్, వృక్ష బంధన్

సిద్దిపేట, ఆగస్టు 14 (way2newstv.in - Swamy Naidu)
సిద్దిపేటలోని కాకతీయ టెక్నో స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులు జెండా కలర్ పేపర్లను తీసుకొని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో భాగంగా రాఖీలను తయారుచేసి తోటి విద్యార్థులు ఒకరికి ఒకరు ఆనందోత్సాహాలతో రాఖీలు కట్టుకొనిఘనంగా రక్షాబంధన్ జరుపుకున్నారు.మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ,సిద్దిపేట జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రవికాంత్ రావు  పిలుపుమేరకు బుధవారం విద్యార్థులు ఘనంగా వృక్షా బంధన్ నిర్వహించారు. ఇందులో వృక్షాలకు జెండా కలర్ లోని రాఖీలను వృక్షాలకు రక్షగా కట్టి దత్తత తీసుకున్నారు.
 కాకతీయ టెక్నో స్కూల్ లో ఘనంగా రక్షాబంధన్, వృక్ష బంధన్ 
ఈ సందర్భంగా ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గు మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం, రక్షాబంధన్ రెండు పండుగలు ఒకేరోజు రావడం అందరిలో ఆనందం వెల్లివిరిసిందని అన్నారు.విద్యార్థులు మూడు రంగుల జాతీయ జెండా కలర్లను ఉపయోగించి రాఖీలను తయారు చేసి తోటి విద్యార్థులకు, వృక్షాలకు, కట్టడం గొప్ప విషయమని, చిన్ననాటినుండే ప్రేమ,అనురాగం, ఆప్యాయత, నేర్చుకుని వృక్షాల పట్ల కూడా అనురాగాన్ని పెంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత ,  ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment