న్యూఢిల్లీ, ఆగస్టు 2 (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాకివ్వనుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచాలని ప్రతిపాదించింది. కొత్త పెట్రోల్, డీజిల్ కారును రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రూ.5,000 చెల్లించాల్సి రావొచ్చు. అదే రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేసుకోవాలంటే రూ.10,000 అవుతుంది. ఇప్పుడు వీటి చార్జీలు కేవలం రూ.600 మాత్రమే. పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని నియంత్రించేందుకు, పాత వాహనాలకు స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) డిమాండ్ పెరగొచ్చని అంచనా వేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈవీల వినియోగాన్ని పెంచడానికి తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై పన్ను ప్రయోజనాలు ప్రకటించారు.
వాహాన దారులకు భారీ షాక్
కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఈవీలపై జీఎస్‌టీని కూడా తగ్గించింది. వీటిపై జీఎస్‌టీ 5 శాతానికి దిగొచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం.. టూవీలర్లకు కొత్త రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000గా ఉంటుంది. ఇది ఇప్పుడు కేవలం రూ.50 మాత్రమే. ఇర రెన్ూవల్ చార్జీలు రూ.2,000గా ఉంటాయి. అదే క్యాబ్స్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10,000గా, రెన్యూవల్ ఫీజు రూ.20,000కు పెరుగుతుంది. ఇప్పడు ఈ చార్జీలు రూ1,000గా ఉన్నాయి. ఇక దిగుమతి చేసుకునే వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును ఏకంగా రూ.5,000 నుంచి రూ.40,000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంపోర్టెడ్ మోటార్‌సైకిల్స్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.20,000గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫీజు రూ.2,500. పరిశ్రమ సంబంధిత వర్గాలు 45 రోజుల్లోగా కొత్త ప్రతిపాదనలకు సంబంధించి వారి సూచనలు తెలియజేయవచ్చు. ఎలక్ట్రిక్, బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలను రిజిస్ట్రేషన్ ఫీజు ఉండకూడదని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే పాత వెహికల్‌ను రద్దు చేసుకొని కొత్త వెహికల్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు పొందొచ్చు. అలాగే 15 ఏళ్ల మించిన వాహనాలకు ఏడాదికి రెండు సార్లు ఫిట్‌నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోతే రోజుకు రూ.50 పెనాల్టీ పడుతుంది.
No comments:
Post a Comment