Breaking News

30/08/2019

కర్ణాటకలో మధ్యంతరం..

బెంగళూర్, ఆగస్టు 30, (way2newstv.in)
కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా? అందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ కేంద్ర నాయకత్వం యడ్యూరప్పకు సంకేతాలు ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడినా అది ఎన్ని రోజుుల ఉంటుందో తెలియదు. మంత్రి వర్గ విస్తరణ, శాఖల కేటాయింపుల తర్వాత బీజేపీలోనూ అసంతృప్తుల సంఖ్య బాగా పెరిగింది. మరో వైపు 17 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల భవష్యత్ ఇంకా అగమ్య గోచరంగానే ఉంది. వారు అమిత్ షాతో భేటీకి హస్తినలో చేయని ప్రయత్నం లేదు. కానీ వారికి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకడం లేదు.కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలినట్లే బీజేపీ సర్కార్ కు అలాంటి అవమానం జరగకూడదని మోదీ, షాలు భావిస్తున్నారు. 
కర్ణాటకలో మధ్యంతరం..

అందుకే పార్టీ సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టి అధిష్టానమే మంత్రి వర్గం జాబితాను రూపొందించింది. వారికి శాఖల కేటాయింపు కూడా తానే దగ్గరుండి చేసింది. ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం వెనక కూడా మధ్యంతర వ్యూహం దాగి ఉందన్నది విశ్లేషకుల అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ సర్కార్ ఎంతో కాలం ఉండదని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది.అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీికి సానుకూలత ఉంది. జమ్మూకాశ్మీర్ అంశంతో పాటు పాక్ తో కయ్యం, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలు మోదీ ఇమేజ్ తో పాటు పార్టీ ఓటు బ్యాంకును కూడా పెంచాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారిందని విశ్వసిస్తున్నారు. అనుకూల వాతవరణంలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న దానిపై కేంద్ర నాయకత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు కనపడుతోంది.ఇటీవల మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు కొత్తేమీ కాదు. కర్ణాటక తీర్పు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వని ప్రజలు, లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి వన్ సైడ్ గా నిలిచారు. దీంతో ప్రజా తీర్పు ఎలా ఉన్నా మధ్యంతర ఎన్నికలకు వెళ్లడమే మంచిదదన్న అభిప్రాయంలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం. అందుకే యడ్యూరప్ప నుకట్టడి చేశారన్న ప్రచారమూ జరుగుతోంది.

No comments:

Post a Comment