Breaking News

20/08/2019

బ్లోటిక్ వ్యాధితోనే ఆవుల మృతి

విజయవాడ ఆగస్టు 20  (way2newstv.in - Swamy Naidu):
మిస్టరీ వీడింది. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతికి కారణం తెలిసింది. ఆవుల మృతిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. ఖాళీ కడుపుతో ఉన్న ఆవులు ఒక్కసారిగా పచ్చి, ఎండు గడ్డి తిన్నాయని.. ఆహారం విషతుల్యంగా మారిందని నివేదికలో ప్రస్తావించారు. ఆహారం విషతుల్యంగా మారి బ్లోటిక్ వ్యాధితో ఆవులు మృతి చెందినట్టు అధికారులు నిర్దారించారు. ఈ మేరకు దర్యాఫ్తు బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం.ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి తీసుకొచ్చిన పచ్చగడ్డి తినడం వల్లే ఆవులు చనిపోయాయి అని గుర్తించారు. ఆ గడ్డిలో రసాయనం ఎక్కువగా ఉంది. ఈ కెమికల్ ని కావాలనే ఎక్కువగా చల్లారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున గోశాలలో 100 ఆవులు చనిపోయాయి. ఒకేసారి ఇన్ని గోవులు చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.
బ్లోటిక్ వ్యాధితోనే ఆవుల మృతి
దీని వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఈ కేసుని సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఏసీపీ ఆధ్వర్యంలో సిట్ పని చేస్తోంది. సిట్ అధికారులు 4 రోజుల క్రితం గోశాలకు వచ్చారు. గోశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వానికి మరో రెండు నివేదికలు అందాల్సి వచ్చింది. ఆ తర్వాత గోవుల మృతికి కారణాలపై పూర్తి స్పష్టత వస్తుందని చెబుతున్నారు.శ్రావణ శుక్రవారం (ఆగస్టు 9,2019) రోజున ఆవులు మృతి చెందిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్దంగా గోశాలలో 1500 ఆవులను ఉంచారనే విషయం బయటపడింది. గోవులకు షెడ్డులు సరిపోవడం లేదు. ఎండలోనే వందలాది ఆవులు ఉంటున్నాయి. సరైన పోషణ లేక 70శాతానికి పైగా ఆవులు బక్కచిక్కాయి. గోశాల నిర్వాహకులు విజయవాడ, ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి 12 టన్నుల మేత తెప్పించారు.

No comments:

Post a Comment