Breaking News

20/08/2019

100 కోట్ల ఆఫర్ బిడ్డింగ్ లో జీహెచ్ఎంసీ

హైద్రాబాద్, ఆగస్టు 20  (nway2newstv.in - Swamy Naidu):
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు బిడ్డింగ్ నిర్వహించింది. బాంబే స్టాక్ ఎక్సైంజ్‌లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా నిధులు సేకరణ జరుగుతుంది. ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న బిడ్డింగ్‌ను గ్రేటర్ మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు రెండు విడతల్లో బిడ్డింగ్‌కు వెళ్లింది. రెండు విడతల్లో రూ.395 కోట్లు సేకరించింది. 
100 కోట్ల ఆఫర్ బిడ్డింగ్ లో జీహెచ్ఎంసీ
ఇవాళ మూడో విడతలో రూ.100 కోట్లను సేకరించింది. కొద్ది రోజుల తరువాత నాలుగో విడత బిడ్డింగ్‌కు వెళ్లనుంది. బిడ్డింగ్ ద్వారా మొత్తం రూ.1000 కోట్లు సేకరించాడమే జీహెచ్‌ఎంసీ లక్ష్యం. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ... బాండ్ల ద్వారా నిధులు సేకరిస్తున్నాం. రోడ్ల అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మున్సిపాలిటీ బాండ్లకు వెళ్లలేదు. బల్దియా సహసం చేసి విజయం సాధించింది. అన్ని కార్పోరేషన్లకు జీహెచ్‌ఎంసీ మార్గదర్శిగా నిలిచింది. ప్రతి ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తాం. అసలు చెల్లించడానికి పదేళ్ల సమయం ఉంటుందని తెలిపారు.

No comments:

Post a Comment