Breaking News

19/08/2019

తెలంగాణలోకి ఏపీ మద్యం వ్యాపారులు

హైద్రాబాద్, ఆగస్టు 19, (way2newstv.in)
ఏపీలో జగన్ ప్రభుత్వం మద్య నిషేధానికి అనుగుణంగా అడుగులు వేస్తూ బెల్టు షాపులపై కొరడా విధించడంతో ఇక అక్కడి మద్యం షాపుల కాంట్రాక్టర్లు తెలంగాణపై దృష్టి సారించారు. ఇక్కడ అలాంటి నియంత్రణ ఏదీ లేకపోవడం వారికి వరంగా మారింది. దీంతో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో తమ వ్యాపారాన్ని సాగించేందుకు నడుం కడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో మద్యం షాపుల ప్రారంభానికి దరఖాస్తుదారులు లక్ష రూపాయల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 
తెలంగాణలోకి ఏపీ మద్యం వ్యాపారులు

తాజాగా ఏపీ‘ గాలి ‘ తెలంగాణాలో వీచనుండడంతో.. ఇక్కడి ప్రభుత్వం ఈ అప్లికేషన్ ఫీజును ఏకంగా రెట్టింపు.. అంటే రెండు లక్షలు చేసినట్టు సమాచారం . ఇప్పటికే లక్ష రూపాయల రుసుముతో ఖజానాకు 300 కోట్లకు పైగా లాభం చేకూరినట్టు చెబుతున్నారు. సాధారణంగా అక్టోబరు నుంచి తెలంగాణాలో కొత్త ఎక్సయిజు పాలసీ ప్రారంభమవుతుంది. అందువల్ల మరో రెండు నెలల్లోగా ఏపీ కాంట్రాక్టర్లు, ఇక్కడ తమ ‘ మద్యం వాపారాన్ని ‘ విస్తరించేందుకు పావులు కదుపుతున్నారని, రెండు లక్షలు కాదు.. మూడు లక్షల ఫీజయినా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని తెలిసింది. దీంతో- అటు- తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరగడానికి వీలుంటుంది గనుక ఇక్కడి సర్కార్ ‘ పచ్ఛ జెండా ‘ ఊపినట్టే లెక్క..

No comments:

Post a Comment