Breaking News

05/08/2019

మారుతున్న చంద్రబాబు

పార్టీలో కొనసాగుతున్న చర్చలు 
గుంటూరు, ఆగస్టు 5, (way2newstv.in)
చంద్రబాబు అంటేనే రాజకీయాలు. ఆయన ఎక్కడ ఉన్నా వాటి గురించే ఆలోచిస్తారు. ఆయన ఆశ, శ్వాస‌, ధ్యాస అన్నీ రాజకీయాలే. రోజులో ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలూ పాలిటిక్స్ కే కేటాయించే అరుదైన క్యారక్టర్ చంద్రబాబుది. ఆయన సమకాలీకుడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా పర్సనల్ లైఫ్ కి టైమ్ ఉంచుకునేవారు. ఇపుడు జగన్ సైతం సీఎం హోదాలో వ్యక్తిగత పర్యటనలు చేస్తున్నారు. అదే చంద్రబాబు విషయంలో మాత్రం భిన్నం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయాల్లోనే మునిగితేలుతారని పేరు. ఆఖరుకు ఫ్యామిలీ ట్రిప్ వెసినా టెలిఫోన్లోనైనా పార్టీ నేతలతో మాట్లాడితే కానీ బాబుకు మనసు కుదుటపడదంటారు. 
మారుతున్న చంద్రబాబు

అటువంటిది చంద్రబాబులో ఇపుడు మార్పు కనిపిస్తోందని తమ్ముళ్ళే అంటున్నారు. అదీ కూడా గత రెండు మూడు నెలల బట్టి బాగా ఎక్కువగా ఉందని కూడా చెబుతున్నారు.చంద్రబాబు ఇపుడు మాజీ ముఖ్యమంత్రి. అయితే ఆయన ఏపీలో ప్రతిపక్ష నాయకుడు, అంతే కాదు, సుదీర్ఘమైన చరిత్ర ఉన్న టీడీపీకి అధినాయకుడు. చంద్రబాబు సామాన్య వక్తి కాదు, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రను బలంగా వేసుకున్న నేత. అటువంటి చంద్రబాబు తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఓ రకంగా ఇబ్బంది పడ్డారని అంటున్నారు. తాను ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం తేడా కొట్టడంతో ఆయనలో కొంత వైరాగ్యభావన కూడా కలిగిందని అంటున్నారు. ఇన్నాళ్ళూ తన గురించి, కుటుంబం గురించి కూడా ఆలొచించకుండా వ్యవహ రించిన చంద్రబాబు ఇపుడు పార్టీని, రాజకీయాలను కాస్తా పక్కన పెట్టేశారు. దానికి వయసు కూడా ఓ కారణంగా చెబుతున్నా చంద్రబాబుకు ఎందుకో రాజకీయ ధోరణుల పట్ల కొంత వ్యతిరేక భావం ఏర్పడిందని అంటున్నారు. మూడు వందల అరవై అయిదు రోజులు, అయిదేళ్ళ పాటు కష్టపడినా అదే ఫలితం, ఎన్నికలకు నెల రోజులు కష్టపడినా అదే వ్యవహారం అయినపుడు ఎందుకీ గుంజులాట అని బాబు డిసైడ్ అయినట్లుగా ఉన్నారు. అందుకే ఆయనలో కొత్త చంద్రబాబుని తమ్ముళ్ళే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారుట. అమెరికా టూర్లో చంద్రబాబు అతి సామాన్యుడుగా అక్కడి వీధులలో తిరుగుతూ పల్లీలు తింటూ షికార్లు చేస్తున్నారు. మరో సందర్భంలో తన సతీమణి భువనేశ్వరి తో కలసి రెస్టారెంట్లలో కాఫీ సిప్ చేస్తూ కనిపించారు. ఇది చంద్రబాబులో కొత్త కోణమే మరి.ఓటమి తరువాత చంద్రబాబు బాగా కుంగిపోయిన మాట వాస్తవం. అయితే ఇపుడు ఆయన దాన్ని లైట్ తీసుకుంటున్నారుట. తనవరకూ ఏపీ జనం చాలానే ఇచ్చారని, మూడు సార్లు సీఎం ని కూడా చేశారని, ఎవరికీ దక్కని అరుదైన రికార్డ్ తన సొంతమని చంద్రబాబు అంటున్నారుట. టీడీపీ అవసరం జనాలకు ఉందని, దాన్ని కాపాడుకోవడం పార్టీ నేతల మీద కూడా ఉందని చంద్రబాబు భావిస్తున్నారుట. తన కుమారుడు భావి నాయకుడిగా ముందు వస్తే సంతోషమని, అదే సమయంలో పార్టీ ముఖ్యమని జనం అనుకున్నపుడు నేత ఎవరు అన్నది కూడా చూడకుండా ఆదరిస్తారని ఆయన విశ్లేషిస్తున్నారుట. ఆ విధంగా తన వారసుడు లోకేష్ అని చెప్పకనే చెబుతున్నారుట. ఇక పార్టీ బాధ్యత‌లు తన కంటే ఎక్కువగా కుమారుడే చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు అనుకుంటున్నారుట. మొత్తానికి ఈ రకమైన ఆలోచనలతో చంద్రబాబుకు పొలిటికల్ సీరియస్ నెస్ ఇపుడు కొంచెం తగ్గిందని అంటున్నారు

No comments:

Post a Comment