Breaking News

07/08/2019

సుస్మా స్వరాజ్ కు డీ.కే.అరుణ నివాళ్ళు

గద్వాల ఆగష్టు 7  (way2newstv.in)
మాజీ కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్ మరణం పట్ల  బిజెపి నేత ,మాజీ మంత్రి డీ.కే.అరుణ ఘనంగాగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్బంగా డికె అరుణమ్మ గారు మాట్లాడుతూమాజీ కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్ గారి మృతి భారతీయ జనతా పార్టీ కే కాకుండా భారత దేశానికి తీరని లోటు అని అన్నారు..తెలంగాణతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె పార్లమెంట్‌లో తెలంగా గొంతుకను బలంగా వినిపించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆమెను తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు. 
సుస్మా స్వరాజ్ కు డీ.కే.అరుణ నివాళ్ళు

370 రద్దు తో ట్విట్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రధాని మోదీ తొలి కేబినెట్లో సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఇందిరా గాంధీ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రెండో మహిళగా సుస్మా స్వరాజ్ గారు ఉన్నారు..ఆమె రికార్డు క్రియేట్ చేశారు.  విదేశాంగ మంత్రిగా ఆమె విశేష సేవలు అందించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడంలో  ఆమె చొరవ చూపారు. నిత్యం ట్విట్టర్లో అందుబాటులో ఉంటూ.. సామాన్యుడి మంత్రిగా అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అప్సర్ పాషా, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జనార్డన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు క్రిష్ణ వేణి రామాంజనేయులు, బండల పద్మావతి వెంకట రాములు, బిజెపి సీనియర్ నాయకులు చిలువేరి జగన్నాథం, రాజశేకర్ రెడ్డి  తదితరులు ఉన్నారు..

No comments:

Post a Comment