Breaking News

07/08/2019

అనసూయ హాట్ ఫోటోలపై కామెంట్స్

హైద్రాబాద్, ఆగస్టు 7  (way2newstv.in)
జబర్దస్త్ స్టేజ్ అయినా.. ప్రైవేట్ ఈవెంట్ అయినా.. ఫ్యామిలీ టూర్ అయినా.. సినిమా ప్రమోషన్ అయినా... ఎక్కడైనా ఎప్పుడైనా... అనసూయ ఉందంటే హాట్ అవతారం షురూ చేయాల్సిందే. క్లీవేజ్ షోతో పాటు.. పొట్టి పొట్టి నిక్కర్లు వేయడం కుర్రకారుకి కైపెక్కించడం అలవాటుగా చేసికున్న ఈ 34 ఏళ్ల హాట్ యాంకర్ బుల్లితెరతో పాటు వెండితెరపైన జిగేల్ మనిపిస్తుంటుంది. క్షణం, రంగస్థలం, యాత్ర వంటి చిత్రాలతో నటిగా గుర్తింపుతెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. తాజాగా ‘కథనం’ చిత్రంలో నటించారు. రాజేష్‌ నాదెండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అనసూయ హాట్ ఫోటోలపై కామెంట్స్

ఈ మూవీ విడుదలలో భాగంగా అనసూయ తన మార్క్ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టింది. ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా.. అనసూయ అందాల ఆరబోత విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రోజుకో హాట్ ఫొటోని షేర్‌ చేసి తన మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌‌కు నయనానందం కలిగించే అనసూయ.. తాజాగా ‘కథనం’ ప్రమోషన్స్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బుల్లి గౌనులో తన భారీ దేహాన్ని కప్పేసుకుని థైస్ షో చేస్తుంది ‘కథనం’ బ్యూటీ. అయితే సినిమా ప్రమోషన్స్‌ని ఈ రకంగా కూడా చేస్తారా? ‘అత్తా.. కుదిరితే ఫాంటు.. లేకపోతే లెగిన్ ఏదో ఒకటి వేసుకో అత్తా.. ఎన్నిసార్లు చెప్పినా ఫ్యాంటు వేసుకోవడం మర్చిపోతున్నావ్.. మేం చెప్పలేక చస్తున్నాం’ అంటూ ఆమె డ్రెస్‌పై దారణమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆ బ్రహ్మదేవుడు మీ అందాన్ని థైస్‌లో దాచాడు అనసూయ.. అదిరేటి డ్రెస్ మీరేస్తే.. బెదిరేటి లుక్స్ మేమిస్తే దడ’ అంటూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నారు మరికొంతమంది. ఇది కథనం ప్రమోషన్స్‌లా లేదు.. మీ తొడల ప్రమోషన్స్‌లా ఉంది.. అసలు మిమ్మల్ని కాదు మీ ఆయన్ని అనాలి అంటూ ఫైర్ అవుతున్నారు అనసూయ ఫాలోవర్స్. కాగా అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్ష లైక్స్‌లు, 100 షేర్‌లతో అనసూయ ‘హాట్’ టాపిక్ అవుతోంది. మొత్తానికైతే ‘కథనం’ మూవీకి అనసూయ హాట్ ప్రమోషన్స్ ‘జబర్దస్త్’గా క్లిక్ అయినట్టే. 

No comments:

Post a Comment