Breaking News

07/08/2019

పనితీరు ఆదర్శవంతంగా వుండాలి

మంత్రి వనిత
అమరావతి ఆగస్టు 7 (way2newstv.in)   
విధుల్లో నిర్లిప్తత విడనాడాలి. అందివోచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని  రాష్ట్ర  మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.  బుధవారం జరిగిన లో రాష్ట్ర స్థాయి మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గోన్నారు. ఈ సమీక్షలో ముఖ్య కార్యదర్శి కె. దమయంతి,  సంచాలకులు కృత్తికా శుక్లా, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పథక సంచాలకులు, సహాయ పథక సంచాలకులు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ  సమిష్టిగా అందరం కలిసి పని చేస్తే ఫలితాలు సాధించ కలుగుతాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి రహిత సమాజం కోసం తప్పనిసరి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
 పనితీరు ఆదర్శవంతంగా వుండాలి

అందుకనుగుణంగా స్నేహ పూర్వక విధానంలో క్షేత్రస్థాయిలో పనితీరు చూపాలి. మనది అనే భావన ఉంటే ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలుగుతాం. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు నిర్వహించాలి, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. స్త్రీ, శిశు సంక్షేమ కోసం పనిచేసే శాఖ మనది. శాఖ పరిధిలో కొంతమంది సిబ్బంది ని, క్షేత్రస్థాయిలోని వారిని వేధింపుల కు గురి చేస్తున్నారని తన  దృష్టికి వొచ్చిందన్నారు. ఇటువంటి వాటిని ఉపేక్షించబోమనిఅన్నారు. శాఖ పరిధిలోను , సమన్వయ శాఖల తోను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి.. ఇందుకు సంబంధించిన ప్రచార సామగ్రిని వారికి చేర్చి అవగాహన పెంచే బాధ్యత చేపట్టాలి  పనితీరు మెరుగు పర్చుకోండి, పనితీరులో నిర్లిప్తంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు. పనితీరు పలువురికి ఆదర్శంగా ఉండాలి. సమాజంలో మనవంతు బాధ్యత ను గుర్తెరిగా మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు. పౌష్టికాహారం పంపిణీ తో బాధ్యత పూర్తి కాదని, మౌలిక సదుపాయాల పై దృష్టి పెట్టాలన్నారు. మౌలిక సదుపాయాల, తదితర అంశాలపై సంబంధించిన శాఖల అధికారులకు తెలియ చెయ్యడం తో పాటు జిల్లా కలెక్టర్లు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గించేలా కృష్టి చేపట్టాలి. బాల్య వివాహాలు, మహిళలు పై వేధింపులు, యాసిడ్ దాడులు, బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు కృష్టి చెయ్యడం తో పాటు, తదనంతరం సంబంధిత అధికారులు తో ఎప్పటికప్పుడు పరిస్థితి ని అధ్యాయం చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన అమ్మఒడి పథకం ఒక చరిత్రాత్మక మైన పధకం, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది జాయిన్ అవ్వడం గుర్తించామని ఆమె అన్నారు. మహిళలు వారికి అప్పగించిన పనిని నిబద్ధతతో బాధ్యత తో నిర్వహిస్తారన్నారు. లోటుపాట్లను ఏవిధంగా అధిగమించగలమో అధ్యయనం చేసి, వాటికి పరిష్కారం చూపే బాధ్యత మీదే అని మంత్రి అన్నారు.  పాలు, గుడ్డు, ఇతర పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత సమర్ధవంతంగా చేపట్టాలి. వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, వాటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేర్చే బాధ్యత మనదేనని అన్నారు. .

No comments:

Post a Comment