విజయవాడ, ఆగస్టు 22, (way2newstv.in)
వాళ్ళిద్దరూ తొలిసారి మంత్రులు….. పదేళ్ల క్రితం ప్రజారాజ్యంతో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాత స్నేహం కూడా ఉంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణలు కలిసొచ్చి ఇద్దరు మంత్రులయ్యారు. ఒకరికి ఒకరు తోడుగా సాగుతున్నారు. ఈ ఇద్దరు మంత్రులకు దుర్గ గుడి ఈఓ మీద కోపం వచ్చింది. చంద్రబాబు హయాంలో ఈఓ నియామకం జరగడం ఓ కారణం అయితే., తమకు నచ్చిన అధికారికి పోస్టింగ్ ఇప్పించుకోవాలన్నది మరో కారణం. ఇంద్రకీలాద్రి దిగువన బ్రాహ్మణ వీధిలో నివసించే మంత్రికి ఈఓ కొటేశ్వరమ్మని అక్కడ ఉంచకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
దుర్గగుడి పంచాయితీ...
ఆమె వైసీపీ వ్యతిరేకి అనే ముద్ర వేయడం ప్రారంభించారు..ఈఓ భర్త టీడీపీ నాయకుడని, అలాంటి వారిని ఇక్కడ ఎలా ఉంచుతారని పార్టీ పెద్దలకు నూరి పోయడం ప్రారంభించారు. ఈఓ భర్త గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉండటంతో అన్ని ప్రయత్నాలు చేశారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో మంగళగిరి స్థానాన్ని ఆశించి టీడీపీలో చేరారు. ఎన్నికల్లో ఆ స్థానం లోకేష్ కి కేటాయించిన తర్వాత దూరంగా ఉండిపోయారు. ఇప్పుడిదే సాకుగా మంత్రులు చక్రం తిప్పడం ప్రారంభించారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఈఓ కొటేశ్వరమ్మ దుర్గ గుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత దుబారా గణనీయంగా తగ్గించారు. గత ఏడాది దసరా ఉత్సవాలను అతి తక్కువ ఖర్చుతో నిర్వహించారు. భర్త రాజకీయాల్లోకి రావడంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని దగ్గరి వారు చెబుతారు. కుటుంబ వ్యాపారాలు వదిలి రాజకీయాల్లోకి రావడంపై కుటుంబ సభ్యుల్లో తీవ్ర చర్చే నడిచిందంటారు. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే ఈఓ ఇప్పుడు రాజకీయాలకు బలవుతున్నారు.ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి బామ్మర్ది విజయవాడ పాతబస్తీలోని దుర్గగుడికి చెందిన మాడపటి గెస్ట్ హౌస్ లో సూట్ రూమ్ కావాలని సమాచారం వచ్చింది. రూమ్ బుక్ చేసిన తర్వాత గెస్ట్ హౌస్ రిసెప్షన్ లో బస చేయడానికి వచ్చిన వారి వివరాలు నమోదు చేసి, ఐడి కార్డు ఇవ్వాలని సిబ్బంది కోరారు. బామ్మర్దిని సంతకం చేయమనడంతో మంత్రికి ఎక్కడ లేని కోపం వచ్చిందట. వెంటనే ఈఓ ని పంపేయాలని మిత్రుడైన మరో మంత్రితో కలిసి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు.ఈఓ భర్తకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉండటం, విధి నిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించడమే ఓ అధికారిణి తప్పులుగా చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కల్లో చూస్తే గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఎందరో అధికారులు ఇప్పుడు కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. వారెవరి మీద లేని అభ్యంతరాలు ఈలోగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తి కాని అధికారి మీద ఎందుకో అమాత్యులకే
No comments:
Post a Comment