Breaking News

24/08/2019

ఎకో గణేష్ కు పెరుగుతున్న డిమాండ్

హైద్రాబాద్, ఆగస్టు 24, (way2newstv.in)
నాచురల్ డై ప్రాసెసింగ్ సెంటర్. ఈ ప్రాజెక్టుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫండింగ్ చేస్తోంది. 2007 నుంచి పరిశోధనలు జరుపుతూ వస్తే, 2016 నాటికి రంగుల తయారీల మీద ఒక అవగాహన వచ్చింది. గత నాలుగేళ్ల నుంచి పెద్ద ఎత్తున కలర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏడాదికి ఎంతలేదన్నా, 20 నుంచి 22 టన్నుల చొప్పున సహజసిద్ధ రంగులు తయారుచేసి, కాలుష్య నియంత్రణ మండలి వారికి అందిస్తున్నారు. రంగులు విడిగా డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా, పీసీబీ తయారుచేసిన విగ్రహాలకూ కలర్స్ స్ప్రే చేసి పంపుతారు.ఇంతకూ నాచురల్ కలర్స్ అంటే ఏంటి? వాటిని ఎలా తయారుచేస్తారు? ఏమేం వాడుతారు? చెప్పాలంటే, పేరులోనే నాచురల్ ఉంది కాబట్టి, ప్రాసెస్ కూడా అంతా సహజసిద్ధంగానే ఉంటుంది. 
ఎకో గణేష్ కు పెరుగుతున్న డిమాండ్

బంతి, మోదుగు, రతన్ జ్యోతి, బుర్రతంగేడు, దానిమ్మ, ఇండిగో లాంటి మొక్కల నుంచి- పువ్వులను, బెరళ్లను, కాండాలను, గింజలను, పండుతొక్కలను తీసి ఎండబెడతారు. వాటిని దంచి పౌడర్‌ చేస్తారు. దాన్ని నీళ్లలో మరిగించి, ఆవిరి తీస్తారు. దానికి సుద్ద కలుపుతారు. ఇలా తయారైన రంగు మట్టికి అంటుకోదు కాబట్టి, తుమ్మబంక, లేదంటే వేరేదేదైనా జిగురు యాడ్ చేస్తారు. అలా సుమారు 14 నుంచి 18 రకాల రంగులు తయారుచేస్తారు. వాటిని కూడా మిక్స్ చేస్తే ఇంకొన్ని కలర్స్ కూడా తీయొచ్చంటారు కమ్యూనిటీ సైన్స్‌ స్టూడెంట్స్.ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కమ్యూనిటీ సైన్స్‌ విద్యార్ధులంతా దీన్నొక ఎక్స్‌పీరియెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం కింద తీసుకున్నారు. విద్యార్ధులే స్వయంగా రంగులు తయారుచేసి సేల్ చేసుకుంటారు. వచ్చిన లాభం కూడా వాళ్లకే. ఇలా చేయడం వెనుక ఇంకో కారణం ఏంటంటే.. విద్యార్ధులు భవిష్యత్తులో ఆంట్రప్రెన్యూర్‌ గా మారితే ఇలాంటి స్కిల్స్ అనుభవంలా ఉపయోగపడతాయి.మొత్తానికి పర్యావరణ పరిరక్షణ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ- కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే పలు స్వచ్చంద సంస్థలు మట్టి వినాయకుల విగ్రహాలను జనానికి ఉచితంగా అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజసిద్ధ రంగులు కూడా జనం దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments:

Post a Comment